మరో ఐదేళ్ల వరకు రిటైర్మెంట్ తీసుకునే ప్రసక్తే లేదంటున్నాడు వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్‌గేల్. దుబాయిలో జరుగుతోన్న 'అల్టిమేట్ క్రికెట్ లీగ్(యూకేసీ)' సందర్భంగా తన రిటైర్మెంట్పై స్పష్టతనిచ్చాడు.
"ప్రస్తుతానికి రిటైర్మెంట్ ప్రకటించే ఉద్దేశం లేదు. మరో ఐదేళ్లు ఆడగలనని భావిస్తున్నా. కాబట్టి 45ఏళ్లలోపు ఎట్టిపరిస్థితుల్లో విరమించేది లేదు. ఇంకో రెండు ప్రపంచకప్‌ల వరకు ఆడతా. క్రికెట్లో యూకేసీ ఒక కొత్త, ఉత్సాహవంతమైన ఫార్మాట్. అందరికీ తప్పకుండా నచ్చుతుంది."
-క్రిస్ గేల్, వెస్టిండీస్ బ్యాట్స్‌మన్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్లో క్రిస్ గేల్ బ్యాట్‌తో దుమ్ములేపి.. కేవలం 7మ్యాచ్‌ల్లో 288 పరుగులు చేశాడు. మరోవైపు వయసు అనేది కేవలం సంఖ్య మాత్రమే అంటున్నాడు యూనివర్సల్ బాస్.
ఇదీ చూడండి: హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు వైస్ కెప్టెన్సీ