ఐపీఎల్-12వ సీజన్ పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో ఉన్న జట్లు కోల్‌కతా, చెన్నై. ఆడిన ఐదింటిలో నాలుగు మ్యాచ్‌లు గెలిచి సమానమైన పాయింట్లతో ఉన్నాయి ఇరు జట్లు. చెన్నై కంటే కోల్‌కతా రన్ రేట్ మెరుగ్గా ఉన్నందున ఆ జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇరుజట్ల మధ్య చెన్నై వేదికగా నేడు మ్యాచ్ జరగనుంది.
రెండు జట్లలోనూ నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. వరుస మ్యాచ్‌ల్లో అదరగొడుతున్న రసెల్ కోల్‌కతా జట్టుకు అదనపు బలం.
హర్భజన్ సింగ్, తాహిర్, రవీంద్ర జడేజా పంజాబ్‌తో మ్యాచ్‌లో మంచి ప్రదర్శన కనబర్చారు. బ్రావో గైర్హాజరుతో జట్టులోకి వచ్చిన డుప్లెసిస్ ఈ సీజన్లో ఆడిన మొదటి మ్యాచ్‌లోనే అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. సొంత మైదానం చెన్నైకి కలిసొచ్చే అంశం. సురేశ్ రైనా, రాయుడు ఫామ్‌ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ధోని మరోసారి జట్టును గెలుపు బాట పట్టిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.
కుల్దీప్ యాదవ్, సునీల్ నరైన్, పీయూష్ చావ్లా లాంటి స్పిన్నర్లతో కోల్‌కతా బౌలింగ్ బలంగా ఉంది. రసెల్ ఫామ్‌తో చెన్నైకి ఇబ్బంది తప్పకపోవచ్చు. క్రిస్ లిన్, ఊతప్ప, నితీష్ రాణాలతో బ్యాటింగ్ లైనప్ బాగుంది. గత మ్యాచ్‌లో పంజాబ్‌పై గెలిచిన నైట్ రైడర్స్ జట్టు ఉత్సాహంతో ఉంది.
జట్ల అంచనా
కోల్‌కతా నైట్ రైడర్స్
దినేశ్ కార్తీక్ (కెప్టెన్), క్రిస్ లిన్, సునీల్ నరైన్, రాబిన్ ఊతప్ప, నితీష్ రాణా, శుభమన్ గిల్, రసెల్, పీయూష్ చావ్లా, కుల్దీప్ యాదవ్, హారీ గున్రే, ప్రసిద్ధ కృష్ణ
చెన్నై సూపర్ కింగ్స్
ధోని (కెప్టెన్), హర్భజన్ సింగ్, వాట్సన్, సురేష్ రైనా, రవీంద్ర జడేజా, కేదార్ జాదవ్, అంబటి రాయుడు, ఇమ్రాన్ తాహిర్, డుప్లెసిస్, దీపక్ చాహర్, స్కాట్ కగ్లిజన్
ఇదీ చూడండి.. ఐపీఎల్ సిత్రాలు.. వికెట్లకు తగిలినా ఔట్ ఇవ్వరు!