సెప్టెంబరు 19 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు టీమ్ఇండియా ఆల్‌రౌండర్ సురేశ్ రైనా. టోర్నీ నిర్వహణ ప్రణాళిక రాకముందు నుంచే ఘజియాబాద్‌లో ప్రాక్టీసు మొదలుపెట్టాడు. నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న వీడియోలను తరచుగా సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నాడు.
సురేశ్ రైనా.. తాజాగా తన భార్య, పిల్లల పేర్లను చేతిమీద ట్యాటూ వేయించుకున్న ఫొటోను షేర్ చేశాడు. ఎడమ మోచేతికి పై భాగంలో తన భార్య ప్రియాంక, దిగువన కుమార్తె గ్రేసియా పేర్లను గతంలోనే ట్యూటూ వేయించగా.. తాజాగా తన కుమారుడు రియో పేరును పచ్చబొట్టుగా వేయించుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోను షేర్ చేశాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
లాక్డౌన్ తర్వాత అవుట్‌డోర్‌లో బ్యాటింగ్ ప్రాక్టీసు మొదలుపెట్టిన భారతీయ క్రికెటర్లలో సురేశ్ రైనా ఒకడు. ఘజియాబాద్‌లోని స్టేడియంలో దిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్‌తో కలిసి నెలరోజులుగా ప్రాక్టీసు చేస్తున్నాడు. తర్వలోనే చెన్నై యాజమాన్యం నిర్వహించే శిక్షణా శిబిరంలో చేరనున్నాడు రైనా. ఆగస్టు 22న యూఏఈకి పయనమయ్యేందుకు చెన్నై జట్టు సంసిద్ధమవుతుంది.