ETV Bharat / sports

టైటిల్​ వేటలో సీఎస్​కే- చెమటోడుస్తున్న ఆటగాళ్లు - చెన్నై సూపర్ కింగ్స్

ఐపీఎల్​ తేదీలు ఖరారైపోయాయి. దీంతో చెన్నై ఆటగాళ్లు ప్రాక్టీస్​ షురూ చేశారు. క్వారంటైన్​ను పూర్తి చేసుకున్న ఆ జట్టు ఆటగాళ్లు.. సోమవారం నుంచే నెట్స్​లోకి వచ్చారు. ధోనీతో పాటు రాయుడు, రుతురాజ్​ గైక్వాడ్, జగదీశన్​, సాయి కిశోర్​, హరి నిశాంత్​ తదితరులు సాధన మొదలు పెట్టారు.

chennai super kings players started practice
ఐపీఎల్​ కోసం చెన్నై ఆటగాళ్ల ప్రాక్టీస్​ షురూ
author img

By

Published : Mar 10, 2021, 7:45 AM IST

Updated : Mar 10, 2021, 10:21 AM IST

ఐపీఎల్​ షెడ్యూల్​ వచ్చేసింది. దీంతో మహేంద్రసింగ్​ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్​ సాధన మొదలు పెట్టింది. నిర్ణీత క్వారంటైన్ వ్యవధిలో కరోనా టెస్టులు విజయవంతంగా పూర్తి చేసుకున్న సూపర్​కింగ్స్​ ఆటగాళ్లు నెట్స్​లోకి వచ్చారు. ధోనీతో పాటు అంబటి రాయుడు, రుతురాజ్​ గైక్వాడ్​, జగదీశన్, సాయి కిశోర్, హరి నిశాంత్ తదితరులు సోమవారం నుంచే సాధన మొదలుపెట్టారు. కొత్తగా జట్టులోకి వచ్చిన ఆంధ్ర కుర్రాడు హరిశంకర్​ రెడ్డి కూడా చెన్నైతో చేరాడు.

"క్వారంటైన్ నిబంధనలను పూర్తి చేసిన చెన్నై ఆటగాళ్లు సోమవారం నుంచే సాధన మొదలుపెట్టారు. త్వరలోనే మిగిలిన ఆటగాళ్లు కూడా వీరితో కలుస్తారు" అని సీఎస్కే వర్గాలు తెలిపాయి. ఇటీవల మినీ వేలంలో మొయిన్ అలీ (రూ.7 కోట్లు), గౌతమ్​ (రూ.9.25 కోట్లు), పుజారా (రూ.50 లక్షలు)లను చెన్నై కొనుగోలు చేసింది. ఐపీఎల్​ వచ్చే నెల 9న ప్రారంభం కానుంది. తన తొలి పోరులో (ఏప్రిల్​ 10) దిల్లీ క్యాపిటల్స్​తో చెన్నై తలపడనుంది.

ఇదీ చదవండి: ఇర్ఫాన్​, గోనీ పోరాటం వృథా.. భారత్​కు తొలి​ ఓటమి

Last Updated : Mar 10, 2021, 10:21 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.