చెన్నై జట్టుకు ఐపీఎల్ మొదటి సీజన్ నుంచి సేవలందిస్తోన్న సారథి ధోని, కోచ్ ఫ్లెమింగ్, సురేశ్ రైనాను చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం సత్కరించింది. వీళ్లు 2008 నుంచి ఇదే ప్రాంఛైజీతో కొనసాగుతున్నారు.
- ఆటగాడే కోచ్:
మొదట చెన్నై తరఫున ఆటగాడిగా బరిలోకి దిగిన ఫ్లెమింగ్ 2009 నుంచి అదే జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ ఫ్రాంఛైజీ 2010, 2011, 2018 టైటిళ్లను కైవసం చేసుకుంది. 'ఛాంపియన్స్ లీగ్' టీ20 టోర్నీని రెండు సార్లు (2010,2014) గెలిచి సత్తా చాటింది.
2019లోనూ ఫేవరెట్‌గా:
వివో ఐపీఎల్ 2019లోనూ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది చెన్నై సూపర్‌కింగ్స్. ఐపీఎల్ 11 సీజన్ ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి మూడోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఇందులో క్రీడాకారులకు మంచి అనుభవం ఉంది. షేన్ వాట్సన్ లాంటి ఆటగాడు ఉండటం సూపర్‌కింగ్స్‌కు అదనపు బలం.
- తొమ్మిది సీజన్లలోనూ...
సీఎస్కే జట్టులో రైనా ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రైనా రికార్డు నెలకొల్పాడు. చెన్నై జట్టు నిషేధం సమయంలో గుజరాత్ లయన్స్ జట్టు తరఫునా అద్భుత ప్రదర్శన చేశాడు. ధోనీ సహా కోచ్ ఫ్లెమింగ్ అనుభవం జట్టుకు బాగా కలిసొస్తుంది.
The Lions who've roared for the longest time being felicitated with all the #Yellove! #WhistlePodu 🦁💛 pic.twitter.com/oQ3pCELw3I
— Chennai Super Kings (@ChennaiIPL) March 20, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">The Lions who've roared for the longest time being felicitated with all the #Yellove! #WhistlePodu 🦁💛 pic.twitter.com/oQ3pCELw3I
— Chennai Super Kings (@ChennaiIPL) March 20, 2019The Lions who've roared for the longest time being felicitated with all the #Yellove! #WhistlePodu 🦁💛 pic.twitter.com/oQ3pCELw3I
— Chennai Super Kings (@ChennaiIPL) March 20, 2019
"ఈ సారీ కప్పు గెలవాలని అనుకుంటున్నాం. మంచి పోటీ ఉన్నా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాం. మా జట్టులో అనుభవం ఉన్న క్రీడాకారులు ఉన్నారు. వారు ఎన్నో ఐపీఎల్‌లు ఆడారు. ఇదే మాకు పెద్ద బలం'
-ఫ్లెమింగ్, చెన్నై సూపర్ కింగ్స్ కోచ్
సొంత మైదానంలో తొలి మ్యాచ్ ద్వారా వచ్చే డబ్బులను పుల్వామా దాడిలో చనిపోయిన జవాన్ల కుటుంబాలకు ఇస్తామని సీఎస్కే జట్టు ప్రకటించింది.