టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ స్పిన్ ద్వయం కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్‌కు ర్యాపిడ్ ఫైర్ నిర్వహించాడు. వీరు ముగ్గురు జరిగిన ఫన్నీ ఇంటర్వ్యూను బీసీసీఐ ట్విట్టర్ వేదికగా పంచుకుంది. ఈ వీడియోపై నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు.
రోహిత్ ర్యాపిడ్ ఫైర్..
రోహిత్: హైదరాబాద్‌లో అత్యుత్తమమైంది ఏంటి?
చాహల్: వెజ్ బిర్యానీ
కుల్దీప్: రాజీవ్ గాందీ ఇంటర్నేషన్ స్టేడియం. ఎందుకంటే నేను ఇక్కటే టీ20లో అరంగేట్రం చేశా.
రోహిత్: జట్టులో చెత్త డ్యాన్సర్ ఎవరు?
చాహల్: శివమ్ దూబే
కుల్దీప్: శివమ్ దూబే
రోహిత్: జట్టులో అత్యంత చెత్త హెయిర్ స్టైల్ ఎవరిది?
చాహల్: మహ్మద్ షమీ
కుల్దీప్: భరత్ అరుణ్
రోహిత్: ఏ బ్యాట్స్‌మెన్‌కు బౌలింగ్ వేయకూడదని అనుకుంటున్నారు?
చాహల్: నీకే(రోహిత్)
కుల్దీప్: సూర్యకుమార్ యాదవ్
-
MUST WATCH: Rapidfire ft. Kuldeep, Chahal and the HITMAN 😃😎
— BCCI (@BCCI) December 10, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Many fun facts from the spin twins @yuzi_chahal & @imkuldeep18 on the questions curated by @ImRo45 🗣️ - by @RajalArora
Full Video Link here 📽️👉👉 https://t.co/taEVM9Prur pic.twitter.com/00aBUSmcV5
">MUST WATCH: Rapidfire ft. Kuldeep, Chahal and the HITMAN 😃😎
— BCCI (@BCCI) December 10, 2019
Many fun facts from the spin twins @yuzi_chahal & @imkuldeep18 on the questions curated by @ImRo45 🗣️ - by @RajalArora
Full Video Link here 📽️👉👉 https://t.co/taEVM9Prur pic.twitter.com/00aBUSmcV5MUST WATCH: Rapidfire ft. Kuldeep, Chahal and the HITMAN 😃😎
— BCCI (@BCCI) December 10, 2019
Many fun facts from the spin twins @yuzi_chahal & @imkuldeep18 on the questions curated by @ImRo45 🗣️ - by @RajalArora
Full Video Link here 📽️👉👉 https://t.co/taEVM9Prur pic.twitter.com/00aBUSmcV5
ఈ సందర్భంగా రోహిత్.. జట్టులో ఎవరినైన మిమిక్రీ చేయమని వారిద్దరిని అడగ్గా. చాహల్.. హిట్ మ్యాన్ వాయిస్‌ను మిమిక్రీ చేశాడు. రోహిత్‌కు అది అంతగా నచ్చలేదు. నువ్వు చాలా చెత్తనటుడువు(బహోత్ బేకార్ యాక్టర్ హై) అంటూ చాహల్‌పై కౌంటర్ వేశాడు. అయితే షమీ గొంతును అద్భుతంగా అనుకరించాడు కుల్దీప్ యాదవ్.
తిరువనంతపురంలో జరిగిన రెండో టీ20లో విండీస్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 171 పరుగుల లక్ష్యాన్ని 15 బంతులు మిగిలుండగానే పూర్తి చేశారు కరీబియన్ బ్యాట్స్‌మెన్. ఓపెనర్ లెండిల్ సిమ్మన్స్(67) అర్ధశతకంతో రాణించాడు. ఫలితంగా మూడు టీ20ల సిరీస్ 1-1 తేడాతో సమంగా ఉంది. బుధవారం నిర్ణాయాత్మక చివరి మ్యాచ్ జరగనుంది.
ఇదీ చదవండి: యాసిడ్ దాడి బాధితురాలిగా దీపికాను చూశారా..!