విశాఖపట్టణం వేదికగా జరుగుతోన్న భారత్-దక్షిణాఫ్రికా తొలి టెస్టులో సఫారీ బ్యాట్స్‌మన్ డీన్ ఎల్గర్ శతకం బాదాడు. అయితే తొమ్మిదేళ్ల తర్వాత ఇండియా పిచ్‌లపై ఓ సౌతాఫ్రికా ప్లేయర్ టెస్టుల్లో సెంచరీ చేయడం ఇదే మొదటిసారి. 2010లో ఆమ్లా చివరిసారిగా భారత్‌లో మూడంకెల స్కోర్ చేశాడు.
ఒకవైపు వికెట్లు పడుతున్నా.. ఎల్గర్ మాత్రం భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. 74 వ్యక్తిగత పరుగుల వద్ద వృద్ధిమాన్ సాహా ఈ ఆటగాడి క్యాచ్ మిస్ చేయడం వల్ల బతికిపోయాడు. వచ్చిన లైఫ్‌ను సద్వినియోగం చేసుకుని 160 పరుగుల భారీ స్కోర్ సాధించాడు. ఇందులో 18 ఫోర్లు, నాలుగు సిక్సులు ఉన్నాయి.
మూడో రోజు ఆటముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 8 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. ఎల్గర్‌తో పాటు డికాక్ శతకంతో మెరిశాడు.
ఇవీ చూడండి.. జడేజా ఖాతాలో అరుదైన రికార్డు..