యావత్ భారతావని ఎన్నికల ఫలితాల గురించి ఎదురు చూస్తుంది. సాధారణ ప్రజల నుంచి అగ్ర రాజకీయ నేతల వరకు ఈ జాబితాలో ఉన్నారు. వీరితో పాటే సినీ తారలు, క్రీడాకారులు తమ రాజకీయ భవిష్యత్తు తేలే క్షణం కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. వీరిలో తొలిసారి పోటీ చేస్తున్న వారు, సిట్టింగ్ స్థానాల నుంచి మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న వారూ ఉన్నారు. మరి ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారో తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే.
| అభ్యర్థి- పార్టీ | నియోజకవర్గం |
1 | జయప్రద (భాజపా) | రామ్‌పుర్, ఉత్తర్‌ప్రదేశ్ |
2 | ఊర్మిళా మాతోండ్కర్ (కాంగ్రెస్) | ఉత్తర ముంబయి, మహారాష్ట్ర |
3 | శతృఘ్న సిన్హా (కాంగ్రెస్) | పట్నా సాహిబ్, బిహార్ |
4 | హేమామాలిని (భాజపా) | మథురా, ఉత్తర్‌ప్రదేశ్ |
5 | మిమీ చక్రవర్తి (తృణమూల్ కాంగ్రెస్) | జాదవ్ పూర్, పశ్చిమ్ బంగ |
6 | రవి కిషన్ (భాజపా) | గోరఖ్‌పుర్, ఉత్తర్‌ప్రదేశ్ |
7 | రాజ్ బబ్బర్ (కాంగ్రెస్) | ఫతేపుర్ సిక్రీ, ఉత్తర్ప్రదేశ్శ్ |
8 | విజేందర్ సింగ్ (కాంగ్రెస్) | దక్షిణ దిల్లీ |
9 | గౌతమ్ గంభీర్ (భాజపా) | తూర్పు దిల్లీ |
10 | సన్నీ డియోల్ (భాజపా) | గురుదాస్‌పుర్, పంజాబ్ |
11 | నిఖిల్ కుమారస్వామి (జేడీఎస్) | మండ్య, కర్ణాటక |
12 | సుమలత ( స్వతంత్య్ర అభ్యర్థి) | మండ్య, కర్ణాటక |
13 | ప్రకాశ్ రాజ్ (స్వతంత్య్ర అభ్యర్థి) | బెంగళూరు సెంట్రల్, కర్ణాటక |
14 | కృష్ణ పూనియా (కాంగ్రెస్) | జైపుర్ గ్రామీణం, రాజస్థాన్ |
15 | రాజ్యవర్ధన్ సింగ్ రాఠోడ్(భాజపా) | జైపుర్ గ్రామీణం, రాజస్థాన్ |