క్రికెట్ ప్రేక్షకులకు శుభవార్త. ఇప్పటికే వెస్టిండీస్-ఇంగ్లాండ్ మధ్య టెస్టు సిరీస్‌తో చాలా రోజుల క్రికెట్ విరామానికి బ్రేక్ పడగా... త్వరలో టీ20 క్రికెట్‌తో మరింత మజా రానుంది. ఇందుకు కరీబియన్ ప్రీమియర్ లీగ్ వేదిక కానుంది. ఈ ఏడాది సీపీఎల్-2020 ఎడిషన్ ప్రేక్షకులు లేకుండా ఖాళీ మైదానాల్లోనే నిర్వహించనున్నారు. కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా ప్రభుత్వం విధించిన నిబంధనలు పాటిస్తూనే టోర్నీ జరగనుందని నిర్వాహకులు వెల్లడించారు.
-
Hero CPL confirms Trinidad & Tobago as venue for 2020. Read more ➡️ https://t.co/8SyiRlbhWY #CPL20 #CricketPlayedLouder pic.twitter.com/sqrHhUFoBf
— CPL T20 (@CPL) July 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Hero CPL confirms Trinidad & Tobago as venue for 2020. Read more ➡️ https://t.co/8SyiRlbhWY #CPL20 #CricketPlayedLouder pic.twitter.com/sqrHhUFoBf
— CPL T20 (@CPL) July 10, 2020Hero CPL confirms Trinidad & Tobago as venue for 2020. Read more ➡️ https://t.co/8SyiRlbhWY #CPL20 #CricketPlayedLouder pic.twitter.com/sqrHhUFoBf
— CPL T20 (@CPL) July 10, 2020
ట్రినిటాడ్ అండ్ టొబాగో వేదికగా ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 10 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఈ సీజన్లో కరీబియన్ ఆటగాళ్లతో పాటు విదేశీ క్రికెటర్లు పాల్గొననున్నారు. రషీద్ ఖాన్, క్రిస్ లిన్, కార్లోస్ బ్రాత్‌వైట్, డ్వేన్ బ్రావో, అలెక్స్ హేల్స్, కీరన్ పోలార్డ్ ఈ క్రీడాపండుగలో పాలు పంచుకోనున్నారు. క్రిస్ గేల్ మాత్రం ఆడట్లేదు.
-
#CPL Here's how things went down in the @CPL draft. Which team is your fav? Who are you looking forward to seeing? Let's us know 👀 #BiggestPartyInSport #CricketPlayedLouder #WIPlayers pic.twitter.com/eGXPiOPqbd
— WIPA (@wiplayers) July 7, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#CPL Here's how things went down in the @CPL draft. Which team is your fav? Who are you looking forward to seeing? Let's us know 👀 #BiggestPartyInSport #CricketPlayedLouder #WIPlayers pic.twitter.com/eGXPiOPqbd
— WIPA (@wiplayers) July 7, 2020#CPL Here's how things went down in the @CPL draft. Which team is your fav? Who are you looking forward to seeing? Let's us know 👀 #BiggestPartyInSport #CricketPlayedLouder #WIPlayers pic.twitter.com/eGXPiOPqbd
— WIPA (@wiplayers) July 7, 2020
"టోర్నీ ప్రారంభానికి ముందే అన్ని జట్లు, అధికారుల కోసం ఒక హోటల్ కేటాయిస్తాం. టోర్నీ కోసం వచ్చిన ప్రతి ఆటగాడు రెండు వారాల పాటు క్వారంటైన్ నిబంధనలు పాటించాలి. ట్రినిడాడ్‌కు వచ్చేముందు, టోర్నీ ముగిసిన తర్వాత వెళ్లేముందు ప్రతి ఒక్కరికీ కరోనా పరీక్షలు చేయనున్నాం. చిన్నపాటి క్లస్టర్లుగా ఏర్పాటు చేసిన గదుల్లో ఆటగాళ్లు ఉంటారు. కాబట్టి ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే ఆ క్లస్టర్లో ఉన్న అందరూ 14 రోజులు క్వారంటైన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. రోజూ ఆటగాళ్ల శరీర ఉష్ణోగ్రతను చెక్ చేస్తారు"
- సీపీఎల్ నిర్వాహకుల ప్రకటన
ఈ లీగ్‌లో ఆరు జట్లు పాల్గొంటాయి. ఇందులో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ జట్టు.. కోల్‌కతా నైట్‌రైడర్స్ యజమాని షారుఖ్ ఖాన్‌కు చెందింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు సెయింట్ లూయిస్ జట్టులో వాటాలున్నాయి. ఈ రెండు ఫ్రాంఛైజీలు ఐపీఎల్లో కీలక భాగస్వామ్యాలను కలిగి ఉన్నాయి. కాబట్టి ఈ టీ20 టోర్నీ ఫలితాలను ఐపీఎల్ యాజమాన్యం పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. ఇంకా ఈ ఏడాది జరగాల్సిన ఐపీఎల్‌పై సందిగ్ధం కొనసాగుతోంది.
ఇదీ చూడండి: పీసీబీకి స్పాన్సర్ దొరికింది.. కానీ లాభం లేదు!