ఇకపై అంతర్జాతీయ క్రికెట్లో స్లో ఓవర్ రేటు కారణంగా కెప్టెన్లను సస్పెండ్ చేయడం ఉండదు. సస్పెండ్ స్థానంలో డాక్ పాయింట్లు లేదా జరిమానా విధిస్తామని నిర్ణయించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ). త్వరలో జరిగే యాషెస్ సిరీస్‌తో ఇది అమల్లోకి రానుంది.
స్లో ఓవర్ రేటుకు సంబంధించి క్రికెట్ కమిటీ ప్రతిపాదించిన అంశాలను ఐసీసీ బోర్డు ఆమోదించింది. ఇది ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్(2019-2021)లో ముందుగా అమలు కానుంది. ఇందులో భాగంగానే ఆగస్టు 1 నుంచి యాషెస్ మొదలుకానుంది.
"అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో స్లో ఓవర్ రేటు కారణంగా కెప్టెన్లు ఇకపై నిషేధానికి గురవ్వరు. ఆటగాళ్లందరూ ఈ భారాన్ని భరించాల్సి ఉంటుంది. కెప్టెన్‌లానే వారికీ జరిమానా విధిస్తారు." -ఐసీసీ
పాత పద్దతి ప్రకారం ఓ ఏడాదిలో రెండు సార్లు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో స్లో ఓవర్ రేటు నమోదు చేస్తే... సంబంధిత జట్టు కెప్టెన్ నిషేధం ఎదుర్కొవాల్సిందే.
ఈ కొత్త నిబంధనతో పాటు రానున్న రోజుల్లో మరిన్ని నూతన విధానాలను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది ఐసీసీ.
ఇది చదవండి: ఐసీసీ హాల్ ఆఫ్ ఫేంలో మాస్టర్ బ్లాస్టర్