జింబాబ్వేతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు విజయం సాధించింది. రావల్పిండి వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలిచి 1-0 తేడాతో సిరీస్‌లో ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో అర్ధసెంచరీతో చెలరేగిన కెప్టెన్ బాబర్ అజామ్ (82)కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
157 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన పాక్ జట్టులో 19 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు ఓపెనర్ ఫకర్ జమాన్. తర్వాత హైదర్ అలీ (7) కూడా నిరాశపర్చాడు. తర్వాత మిడిలార్డర్లో వచ్చిన హఫీజ్ (37)తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు విజయాన్ని అందించాడు కెప్టెన్ బాబర్ అజామ్ (82).
![Captain Babar Azam leads Pakistan to big win over Zimbabwe](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9469877_zim_0711newsroom_1604760499_614.jpg)
అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వేకు అర్ధశతకంతో గౌరవప్రదమైన స్కోర్ అందించాడు యువ ఆటగాడు మధివెరా. 48 బంతుల్లో 70 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అయినా మిగతావారు విఫలమైన కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది జింబాబ్వే. ఈ రెండు జట్ల మధ్య రెండో టీ20 ఆదివారం జరగనుంది.