ప్రస్తుత క్రికెట్లో కోహ్లీ, రోహిత్ ఎవరు గొప్ప? అనే చర్చ నడుస్తోంది. కొందరు విరాట్‌కు మద్ధతు పలకగా, మరికొందరు రోహిత్ పేరు చెబుతున్నారు. తాజాగా ఇదే విషయమై స్పందించిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్.. ఛేదనలో కోహ్లీనే కింగ్ అని చెప్పాడు.
"భారత్ భారీ లక్ష్యాలను పూర్తిచేసే క్రమంలో కోహ్లీ నిలకడగా ఆడతాడు. రోహిత్.. కొత్త బంతిని చాలా చక్కగా ఎదుర్కొని బౌలర్లను ఉతికారేస్తాడు. ఈ విషయంలో వీరిద్దరిని పోల్చి చూడటం సరికాదు. ఎవరికి వారే సాటి. కానీ ఛేదనలో విరాట్ అత్యుత్తమ బ్యాట్స్‌మన్" -బ్రాడ్ హాగ్, ఆసీస్ మాజీ బౌలర్
అంతకు ముందు ఇదే విషయంపై మాట్లాడిన ఎమ్‌సీసీ అధ్యక్షుడు, శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార్ సంగక్కర.. ప్రస్తుత క్రికెట్లోని ఛేదనలో కోహ్లీ-రోహిత్లది అత్యుత్తమ జోడీ అని పేర్కొన్నాడు. అన్ని ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తూ, చాలా బాగా ఆడుతున్నారని చెప్పుకొచ్చాడు.
ఇది చదవండి: విదేశాల్లో ఐపీఎల్ నిర్వహణపై బీసీసీఐ ఆలోచన?