ETV Bharat / sports

బీసీసీఐకి రూ.4 వేల కోట్ల నష్టం తప్పింది.. ఎలా అంటే? - ఐపీఎల్​ 2020

కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలోనూ ఐపీఎల్​ను జరిపేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఒకవేళ​ టోర్నీ వాయిదా పడితే మాత్రం దాదాపు రూ. 4 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లనుంది. అందుకే ఎలా అయినా సరే లీగ్​ను విజయవంతంగా నిర్వహించాలని బీసీసీఐ భావిస్తుంది.

Cancelling IPL could have resulted in Rs 4000 crores loss for BCCI
ఐపీఎల్​ రద్దైతే బీసీసీఐకి రూ.4 వేల కోట్ల నష్టం!
author img

By

Published : Jul 24, 2020, 2:23 PM IST

ఐపీఎల్​ను ఈ ఏడాదే నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. కొత్త తేదీలనూ ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్ వెల్లడించారు. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 మధ్య పూర్తిస్థాయి టోర్నీని యునైటెడ్​ అరబ్​ ఎమిరేట్స్​ (యూఏఊ)లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది చివర్లో టీమ్​ఇండియా ఆసీస్​ పర్యటనకు వెళ్లాల్సిన కారణంగా భారత ఆటగాళ్లు బయలుదేరే వారం ముందే ఈ టోర్నీని ముగించనున్నారు. కొన్ని నివేదికల ప్రకారం ఐపీఎల్​ ప్రసారదారు​ స్టార్ స్పోర్ట్స్ నుంచి ఏటా రూ.3,300 కోట్లు, టైటిల్​ స్పాన్సర్​ వివో నుంచి రూ.440 కోట్లు.. ఇతర స్పాన్సర్ల నుంచి రూ.170 కోట్ల ఆదాయం రానుందని తెలుస్తోంది. ఒకవేళ లీగ్ రద్దయి ఉంటే ఈ మొత్తం కోల్పోవాల్సి వచ్చేది.

Cancelling IPL could have resulted in Rs 4000 crores loss for BCCI
ఐపీఎల్​ రద్దైతే బీసీసీఐకి రూ.4 వేల కోట్ల నష్టం!

ఐపీఎల్​ ప్రసారదారు స్టార్​ ఇండియా.. బీసీసీఐకి ఇప్పటికే రూ.2 వేల కోట్లను చెల్లించిందని సమాచారం. కాబట్టి ఈ పరిస్థితుల్లో టోర్నీ ఆగిపోతే కోర్టు కేసులకు దారి తీసే అవకాశం ఉంది. అదే విధంగా అడ్వాన్స్​ తిరిగి చెల్లించడం లేదా కాంట్రాక్టును పొడిగించడం చేయాల్సి ఉంటుంది. అందుకే ఈ టోర్నీని నిర్వహించేందుకే బోర్డు శతవిధాల ప్రయత్నిస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.