బంగాల్ క్రికెట్ జట్టు సెలక్టర్ సాగరమయి సేన్శర్మ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని బంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అవిషేక్ దాల్మియా ధ్రువీకరించారు.
"తొలుత సాగర్మయి భార్యకు కరోనా సోకింది. ఆమె కోలుకున్న తర్వాత అతడు వైరస్ బారినపడ్డాడు. వైద్యపరీక్షల్లో మిగతా కుటుంబసభ్యులకు నెగిటివ్గా తేలింది" -అవిషేక్ దాల్మియా, క్యాబ్ అధ్యక్షుడు
1989-90లో రంజీ విజేతగా నిలిచిన బంగాల్ జట్టులో సాగర్మయి సభ్యుడిగా ఉన్నారు. ప్రస్తుతం ఇతడిని ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
శనివారం నాటికి బంగాల్లో 4813 మంది కరోనా బారిన పడగా, 2736 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 1775 మంది వైరస్ నుంచి కోలుకోగా, 302 మంది దీని ప్రభావం వల్ల మరణించారు.