ETV Bharat / sports

'వారిని గుర్తించలేకపోయాం.. ఆ ఆరుగురు నిర్దోషులే' - టీమ్​ఇండియా జాతి వివక్ష సిడ్నీ టెస్టు

సిడ్నీ టెస్టులో టీమ్​ఇండియా ఆటగాళ్లపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన ప్రేక్షకులను గుర్తించలేకపోయామని ఐసీసీకి.. క్రికెట్​ ఆస్ట్రేలియా నివేదికను సమర్పించింది. స్టాండ్స్​ నుంచి గెంటివేసిన ఆరుగురు ప్రేక్షకులు నిర్దోషులుగా విచారణలో తేలిందని తెలిపింది.

racism
జాతి వివక్ష
author img

By

Published : Jan 27, 2021, 6:48 AM IST

సిడ్నీ టెస్టు సందర్భంగా భారత క్రికెటర్లపై జాతి వివక్ష దూషణలకు దిగిన ప్రేక్షకులను గుర్తించలేకపోయామని క్రికెట్​ ఆస్ట్రేలియా(సీఏ).. ఐసీసీతో చెప్పింది. స్టాండ్స్​ నుంచి గెంటివేసిన ఆరుగురు ప్రేక్షకులు అసలు దోషులు కాదని విచారణలో తేలిందని తెలిపింది. ఈ మేరకు ఐసీసీకి.. సీఏ నివేదికను సమర్పించింది.

"భారత ఆటగాళ్లపై జాతి వివక్ష వ్యాఖ్యలు నిజమే అని నమ్ముతున్నాం. కానీ దర్యాప్తు అధికారులు దోషులను గుర్తించలేకపోయారు" అని నివేదికలో సీఏ పేర్కొన్నట్లు ఆస్ట్రేలియా మీడియా వెల్లడించింది. అంతకుముందు తన ఓవర్లో రెండు సిక్స్​లు పోయినందుకు కలత చెందిన సిరాజ్​.. ప్రేక్షకుల్లో ఒకరు "వెల్కమ్​ టు సిడ్నీ, సిరాజ్" అన్నందుకు అంపైర్​ వద్దకు వెళ్లినట్లు గెంటివేతకు గురైన ఓ ప్రేక్షకుడు చెప్పాడని ఓ పత్రిక తెలిపింది.

ఇదీ చూసింది: క్రికెట్​లోనూ జాతి వివక్ష.. ఇవిగో సాక్ష్యాలు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.