ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇప్పట్లో చక్కబడేట్లు లేవని అన్నాడు ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్. ఇలానే ఉంటే అక్టోబరులో టీ20 జరగడం అనుమానమేనని చెప్పాడు. లాక్డౌన్తో ఇంటికే పరిమితమైన టీమిండియా ఆటగాడు రోహిత్ శర్మతో ఇన్స్టా లైవ్లో మాట్లాడుతూ ఈ విషయాన్ని పంచుకున్నాడు.
"పరిస్థితులు చూస్తుంటే టీ20 ప్రపంచకప్ అనుకున్నట్లు జరిగేలా కనిపించడం లేదు. 16 జట్లను ఒక్కదగ్గరకు, అదీ ఇలాంటి పరిస్థితుల్లో తీసుకురావడం చాలా కష్టం" -వార్నర్, ఆసీస్ క్రికెటర్
అనంతరం మాట్లాడిన రోహిత్.. ఆస్ట్రేలియాతో తనకు మ్యాచ్ ఆడటం చాలా ఇష్టమని చెప్పాడు. గత పర్యటనలో ఆసీస్ జట్టుపై విజయం సాధించడం ఆనందంగా ఉందని అన్నాడు. ఈ సారి స్మిత్, వార్నర్ రాకతో సిరీస్ మరింత రసవత్తరంగా ఉండే అవకాశముందని తెలిపాడు.
అయితే ఖాళీ మైదానాల్లో ఆడే విషయమై స్పందించిన వార్నర్.. అప్పుడు బంతి శబ్దం తప్ప మరేం వినిపించదని, వార్మప్ గేమ్ ఆడినట్లే ఉంటుందని చెప్పాడు.