ETV Bharat / sports

బుమ్రా.. కుంబ్లేలా​ బౌలింగ్​ వేస్తే..! - anil kumble

విభిన్న బౌలింగ్ శైలితో ప్రత్యర్థి బ్యాట్స్​మెన్లకు చుక్కలు చూపించే బుమ్రా.. స్పిన్​ బౌలింగ్​ వేస్తే.! అదీ భారత స్పిన్​ దిగ్గజం కుంబ్లేను అనుకరిస్తే.! వినడానికే ఆసక్తికరంగా ఉంది కదూ. అయితే చూడండి మరి.

Bumrah tried to imitate the bowling style of the legendary spinner Kumble.
బుమ్రా.. కుంబ్లేలా​ బౌలింగ్​ వేస్తే..!
author img

By

Published : Jan 31, 2021, 7:07 AM IST

టీమ్​ఇండియా పేసర్​ బుమ్రా అంటే.. విభిన్నమైన బౌలింగ్ శైలి.. గురి తప్పని యార్కర్లు.. పదునైన బౌన్సర్లు గుర్తుకొస్తాయి. తన పేస్​తో ప్రత్యర్థి బ్యాట్స్​మెన్​ను ముప్పుతిప్పులు పెడతాడు ఈ ఫాస్ట్​బౌలర్​. కానీ అదే బుమ్రా స్పిన్నర్​గా మారితే.. అనిల్​ కుంబ్లేలా బంతిని గింగిరాలు తిప్పితే ఎలా ఉంటుంది? ఇదిగో ఇలా ఉంటుందంటూ బీసీసీఐ శనివారం ట్విట్టర్​లో ఓ వీడియో పోస్టు చేసింది. అందులో కుంబ్లే బౌలింగ్​ శైలిని అనుకరిస్తూ నెట్స్​లో స్పిన్​ వేస్తూ బుమ్రా కనిపించాడు. అచ్చం అలాగే బంతులేస్తూ కుంబ్లేను మరిపించాడు.

"బుమ్రా భయపెట్టే యార్కర్లను, పదునైన బౌన్సర్లను మనం చూశాం. కానీ ఇప్పుడు మునుపెన్నడూ చూడని ఈ ఫాస్ట్​బౌలర్​ కొత్త అవతారాన్ని మీ ముందు ఉంచుతున్నాం. దిగ్గజ స్పిన్నర్​ కుంబ్లే బౌలింగ్​ శైలిని అనుకరించేందుకు బుమ్రా ప్రయత్నించాడు. అద్భుతంగా వేశాడు" అంటూ బీసీసీఐ వీడియో పోస్టు చేసింది. మైదానంలో కుంబ్లే బౌలింగ్​తో నెట్స్​లో బుమ్రా బౌలింగ్​ను పోలుస్తూ ఆ వీడియో రూపొందించారు.

ఇదీ చదవండి: రహానె.. ఆ కేకును ఎందుకు కోయలేదంటే..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.