వెస్టిండీస్‌తో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో తన అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు భారత బౌలర్ ఇషాంత్ శర్మ. ఐదు వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టు 222 పరుగులకు ఆలౌట్ కావడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఇన్నింగ్స్ అనంతరం మాట్లాడిన ఇషాంత్.. తనకు సలహా ఇచ్చిన యువ బౌలర్‌పై ప్రశంసలు కురిపించాడు.
"వర్షం పడిన అనంతరం బంతి తడిగా మారింది. అప్పుడు మా బౌలింగ్‌లో వికెట్లు తీయడం కష్టమైంది. ఆ సమయంలో క్రాస్ సీమ్ బౌలింగ్ వేయమని బుమ్రా సలహా ఇవ్వడం వల్ల బౌన్స్ లభించింది. వికెట్లు దక్కించుకున్నాను" -ఇషాంత్ శర్మ, భారత బౌలర్
తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌లోనూ తోడ్పడ్డాడు ఇషాంత్ శర్మ. చేసింది 19 పరుగులే అయినా.. రవీంద్ర జడేజా(58)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 60 పరుగుల విలువైన భాగస్వామ్యం నమోదు చేశాడు.
ఇది చదవండి: తొలి టెస్టు: 222 పరుగులకు వెస్టిండీస్ ఆలౌట్