భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. దాదాపు మూడు నెలల విరామం తర్వాత బరిలోకి దిగనున్నాడు. రంజీల్లో గుజరాత్ తరఫున ఆడనున్నాడు. సూరత్‌లో బుధవారం కేరళతో మ్యాచ్ జరగనుంది. ఇందులో ఆడి తన ఫిట్నెస్ నిరూపించుకోనున్నాడు.
ఈ ఏడాది వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ జరుగుతుండగా బుమ్రాను వెన్నునొప్పి బాధించింది. అనంతరం శస్త్రచికిత్స జరిగింది. దాదాపు 3 నెలలు విశ్రాంతి తీసుకున్నాడు. ఇప్పుడు గాయం నుంచి కోలుకున్నాడు. త్వరలో జరిగే శ్రీలంక, ఆస్ట్రేలియా సిరీస్‌ల కోసం తుదిజట్టులోకి ఎంపికయ్యాడు.
ఇటీవలే విశాఖపట్నంలో జరిగిన విండీస్-భారత్ రెండో వన్డే ముందు నెట్ ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నాడు బుమ్రా. కానీ మైదానంలో అడుగుపెట్టలేదు.
టెస్టుల్లో టీమిండియా నుంచి హ్యాట్రిక్ తీసిన బౌలర్‌గా బుమ్రా ఘనత సాధించాడు. హర్భజన్‌సింగ్, ఇర్ఫాన్ పఠాన్ ఇతని కంటే ముందున్నారు. ఈ ఏడాది ఆడిన 12 టెస్టుల్లో 62, వన్డేల్లో 103, టీ20ల్లో 51 వికెట్లను కొల్లగొట్టాడు జస్ప్రీత్.