కొంతకాలంగా టీమ్ఇంండియా పేస్ బౌలింగ్ బలంగా తయారైంది. మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా ఇలా ప్రతి ఒక్కరు మెరుగైన ప్రదర్శన చేస్తూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. అయితే ఇందులో ఎక్కువ ప్రమాదకారి బుమ్రానే అంటున్నాడు ఆస్ట్రేలియా క్రికెటర్ లబుషేన్.
"గంటకు 140 కి.మీల వేగంతో స్థిరంగా బౌలింగ్ చేయగల సత్తా బుమ్రాకు ఉంది. పరిస్థితులు అనుకూలిస్తే బంతిని ఇరువైపులా స్వింగ్ చేయగలడు. అందుకే బుమ్రా బౌలింగ్‌లో ఆడటం చాలా కష్టం. భారత పేస్ దళం బలంగా ఉంది. బుమ్రా ప్రమాదకర బౌలర్. ఒక బ్యాట్స్‌మన్‌గా పరీక్షించుకోవాలంటే బుమ్రా బౌలింగ్‌లో ఆడితేనే సత్తా బయటకొస్తుంది. టీమ్ఇండియా పేస్ దళానికి బుమ్రానే లీడర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇషాంత్ శర్మ కూడా బాగా మెరుగయ్యాడు. రాబోయే సిరీస్‌ల్లో భారత నుంచి గట్టి పోటీ తప్పదు."
-లబుషేన్, ఆసీస్ క్రికెటర్
గతేడాది ఇంగ్లాండ్‌తో జరిగిన యాషెస్ సిరీస్ సందర్భంలో స్టీవ్ స్మిత్ గాయపడగా అతడి స్థానంలో లబుషేన్ కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలో దిగాడు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో సఫలమయ్యాడు. ఇప్పటివరకూ 14 టెస్టు మ్యాచ్‌లు ఆడిన లబుషేన్ నాలుగు సెంచరీలు, ఏడు హాఫ్ సెంచరీలు సాధించాడు.