ETV Bharat / sports

బళ్లుమన్న విండీస్​ వికెట్లు- భారత్​ భారీ విజయం

వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 318 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఫాస్ట్‌ బౌలర్లు బుమ్రా (5/7), ఇషాంత్‌ (3/31), షమి (2/13) చెలరేగిపోయారు. వీరి ధాటికి రెండో ఇన్నింగ్స్‌లో విండీస్‌ 26.5 ఓవర్లలో 100 పరుగులకే ఆలౌటైంది. విండీస్‌ తరఫున కీమర్‌ రోచ్‌ (38; 31బంతుల్లో 1×4, 5×6) టాప్‌ స్కోరర్‌. సెంచరీ హీరో అజింక్యా రహానె  ప్లేయర్​ ఆఫ్​ ది మ్యాచ్​గా నిలిచాడు.

బళ్లుమన్న విండీస్​ వికెట్లు- కోహ్లీసేనకు భారీ విజయం
author img

By

Published : Aug 26, 2019, 3:52 AM IST

Updated : Sep 28, 2019, 6:59 AM IST

అజింక్యా రహానె సెంచరీతో కరీబియన్​ జట్టు​ ముందు భారీ లక్ష్యం ఉంచగా​.. భారత పేస్​ సంచలనం బుమ్రా పదునైన బంతులతో విండీస్​ వికెట్లు బళ్లుమనిపించాడు. 419 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్​ ఆరంభించిన విండీస్​ భారత పేస్​ దళం ధాటికి 100 పరుగులకే కుప్పకూలిపోయింది.

బుమ్రా (5/7), ఇషాంత్‌ (3/31), షమి (2/13) విసిరిన బంతులకు విండీస్​ బ్యాట్స్​మెన్​ పెవిలియన్​కు క్యూ కట్టారు. కోహ్లీసేన 318 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.

బుమ్రా
బుమ్రా

బుమ్రా షో...

పిచ్​ పేస్​కు సహకరిస్తోన్న వేళ స్పీడ్​ స్టర్​ బుమ్రా చెలరేగిపోయాడు. ఇన్ ​స్వింగ్​, ఔట్​ స్వింగ్​ బంతులతో విండీస్​ బ్యాట్స్​మెన్​ను​ బెంబేలెత్తించాడు. మొదటి స్పెల్​లో బుమ్రా వేసిన 8 ఓవర్లు మ్యాచ్​కే హైలెట్. ​ కేవలం 7 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇందులో 4 వికెట్లు బౌల్డ్​ కావడం విశేషం. బుమ్రాకు ఇషాంత్​, షమీ సహకరించడం వల్ల భారత్​ నాలుగవ రోజే మ్యాచ్​ ముగించింది.

బుమ్రా
బుమ్రా

రోచ్​ ఒక్కడే...

బుమ్రా దెబ్బకు విండీస్​ టాప్​ ఆర్డర్​ పేకమేడలా కూలిపోయింది. బ్రాత్​వైట్​ (1), క్యాంప్​బెల్​ (7), డారెన్​ బ్రావో (2), హోప్​ (2) ఇలా ఎవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. వెస్టిండీస్​ సారథి హోల్డర్​ (8) కూడా బుమ్రా నుంచి తప్పించుకోలేపోయాడు. కీమర్​ రోచ్​ (38), కమిన్స్ (19*), చేజ్​ (12) మాత్రమే రెండు అంకెల స్కోరు సాధించారు. శతకంతో చెలరేగిన భారత బ్యాట్స్​మెన్​ రహానెకు ప్లేయర్​ ఆఫ్​ ది అవార్డ్​ దక్కింది.

రహానె
రహానె

రికార్డులు...

  1. ఇది టీమిండియాకు విదేశాల్లో పరుగుల పరంగా అతిపెద్ద టెస్ట్​ గెలుపు.
  2. ఓవరాల్​గా పరుగుల పరంగా నాలుగవ అతిపెద్ద విజయం.
  3. కెప్టెన్​గా అత్యధిక టెస్ట్​ విజయాల జాబితాలో కోహ్లీ (27), ధోని (27)తో కలసి అగ్రస్థానం పంచుకున్నాడు.
  4. సొంతగడ్డ వెలుపల అత్యధిక టెస్ట్​ విజయాలు అందించిన టీమిండియా సారథిగా విరాట్​ చరిత్రకెక్కాడు. మొత్తం 26 టెస్టుల్లో 12 విజయాలు అందించాడు. 28 టెస్టుల్లో 11 విజయాలతో గంగూలీ రెండో స్థానంలో ఉన్నాడు.
  5. భారత్​ పేస్​ బౌలర్లలో​ అతి తక్కువ మ్యాచ్​లకే 50 వికెట్లు సాధించిన బౌలర్​గా బుమ్రా రికార్డు సాధించాడు. 11 మ్యాచ్​లకే 50 వికెట్ల రికార్డు కొల్లగొట్టాడు.
  6. భారత్​తో టెస్ట్​ మ్యాచ్​లో ఒక ఇన్నింగ్స్​లో విండీస్​కు ఇదే అత్యల్ప స్కోరు.

Vidisha (Madhya Pradesh), Aug 26 (ANI): At least one person died while another was injured after a house collapsed in Madhya Pradesh's Vidisha. Incident happened due to heavy rains in the region. The victims were taken to a nearby hospital using cot and ropes in flooded water.

Last Updated : Sep 28, 2019, 6:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.