ETV Bharat / sports

బుమ్రా దిగువకు.. బ్రాడ్​ ఏడు స్థానాలు పైకి - ENG VS WI TEST

ఐసీసీ తాజా ర్యాంకింగ్స్​లో ఇంగ్లాండ్ బౌలర్ బ్రాడ్​ దూకుడు ప్రదర్శించాడు. ఏకంగా ఏడు స్థానాలు పైకి వెళ్లాడు. ఫలితంగా బుమ్రా ఓ స్థానం కోల్పోయాడు.

బుమ్రా దిగువకు.. బ్రాడ్​ ఏడు స్థానాలు పైకి
ఇంగ్లాండ్ బౌలర్ బ్రాడ్
author img

By

Published : Jul 29, 2020, 3:29 PM IST

Updated : Jul 29, 2020, 3:46 PM IST

ఇంగ్లాండ్​ బౌలర్ స్టువర్ట్​ బ్రాడ్​.. ఐసీసీ తాజా ర్యాంకింగ్స్​లో ఏడు స్థానాలు పైకి ఎగబాకి మూడో స్థానానికి చేరుకున్నాడు. వెస్టిండీస్​తో మూడో టెస్టులో అద్భుత ప్రదర్శన(67/10) చేసిన ఇతడు... టెస్టుల్లో 500 వికెట్ల మార్క్​ను అందుకున్నాడు. ఈ మ్యాచ్​లో 269 పరుగుల తేడాతో గెలిచిన ఇంగ్లిష్ జట్టు, 2-1 తేడాతో విజ్డెన్​ ట్రోఫీని గెలుచుకుంది.

కరోనా కారణంగా మార్చి నుంచి మైదానంలో దిగకపోవడం వల్ల భారత క్రికెటర్ల ర్యాంక్​లు పదిలమే. కోహ్లీ(2), పుజారా(7), రహానె(9) తమ స్థానాల్లోనే ఉన్నారు.

bumrah
భారత బౌలర్ బుమ్రా

ఆల్​రౌండర్ల జాబితాలో జడేజా, అశ్విన్.. మూడు, ఐదు స్థానాల్లోనే కొనసాగుతున్నారు. బౌలర్ల ర్యాంకింగ్స్​లో బ్రాడ్, ఏడు స్థానాలు పైకి వెళ్లడం వల్ల భారత స్టార్ బుమ్రా.. ర్యాంక్ కోల్పోయి ఎనిమిదికి పడిపోయాడు.

ఇది చదవండి: చివరి టెస్టులో గెలుపు.. విజ్డెన్ ట్రోఫీ ఇంగ్లాండ్​దే

Last Updated : Jul 29, 2020, 3:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.