ETV Bharat / sports

' ప్రత్యేక విమానాల్లో తీసుకురండి.. కానీ ప్రపంచకప్​ ఆపొద్దు' - Bring teams in charter flights

తమ దేశంలో జరగబోయే టీ20 ప్రపంచకప్​​ను వాయిదా లేదా రద్దు చేయడం సరికాదని అభిప్రాయపడ్డాడు ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్​ బ్రాడ్​ హాగ్. అవసరమైతే ఆటగాళ్లను విమానాల్లో తీసుకురావాలని సూచించాడు.

Bring teams in charter flights, test them for corona but dont cancel WT20
'ఛార్టర్డ్​ విమానాల్లో వారిని తీసుకురండి'
author img

By

Published : Apr 16, 2020, 4:53 AM IST

కరోనా ప్రభావం తీవ్రమవుతున్న నేపథ్యంలో ఆస్ట్రేలియాలో జరగబోయే టీ20 ప్రపంచకప్​​ నిర్వహణపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. షెడ్యూల్​ ప్రకారం ఈ ఏడాది అక్టోబర్​ 18 నుంచి నవంబరు 15 వరకు టోర్నీ జరగాల్సి ఉంది. అయితే ప్రాణాంతక కరోనా వల్ల దీనిని వాయిదా లేదంటే రద్దు చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై ఆసీస్​ మాజీ స్పిన్నర్​ బ్రాడ్​ హాగ్ స్పందించాడు. టోర్నీ రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పాడు. తగు జాగ్రత్తలు తీసుకుని అనుకున్న తేదీ ప్రకారం టోర్నీ నిర్వహించాలనే అభిప్రాయం వ్యక్తం చేశాడు.

"టీ20 ప్రపంచకప్​ వాయిదా లేదా రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాను. అవసరమైతే నెల రోజులు ముందుగానే టోర్నీలో ఆడే మిగతా దేశాల క్రికెటర్లకు కరోనా పరీక్షలు నిర్వహించి, ఛార్టర్డ్​ విమానాల్లో దేశానికి తీసుకురండి. రెండు వారాల పాటు క్వారంటైన్​లో ఉంచండి. అనంతరం మరోసారి పరీక్షలు నిర్వహించండి. అప్పుడు ఆరోగ్య పరిస్థితి ఆధారంగా వారిని ఆటకు అనుమతి ఇవ్వండి. క్రికెట్​ ఆడేటప్పుడు సాధారణంగానే ఓ మీటరు భౌతిక దూరం పాటిస్తారు. కేవలం స్లిప్​లో​ దూరం పాటించడం కాస్త ఇబ్బంది అవుతుంది. కాబట్టి అక్కడ దూరం పాటించేలా జాగ్రత్త పాటిస్తే సరిపోతుంది. ఈ టోర్నీ ఎప్పుడు జరుగుతుందా అని అభిమానులు ఎదురుచూస్తుంటారు. కనుక ఇటువంటి ప్రతిష్ఠాత్మకమైన టోర్నీలు రద్దు చేయడమనేది సరైంది కాదు"

-​ బ్రాడ్​ హాగ్, ఆసీస్​ మాజీ స్పిన్నర్.

ఇదీ చూడండి : 'ఐపీఎల్‌ కంటే‌ మాకు ఆ టోర్నీయే ముఖ్యం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.