ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరిదైన నాలుగో టెస్టులో టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో గౌరవప్రదమైన స్కోరు సాధించింది. శార్దుల్ ఠాకూర్(67), వాషింగ్టన్ సుందర్(62) రాణించడం వల్ల భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 111.4 ఓవర్లకు 336 పరుగులు చేసి ఆలౌట్ అయింది. రోహిత్ శర్మ 44 పరుగులు చేశాడు. ఫలితంగా ఆసీస్‌కు 33 పరుగుల ఆధిక్యం లభించింది.
ఓవర్‌నైట్ స్కోరు 62/2 మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. ఆసీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కోంది. ప్రధాన బ్యాట్స్‌మెన్ పుజారా(25), రహానె(37), అగర్వాల్(38), పంత్(23) పెద్దస్కోర్లు సాధించికపోయినా.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఠాకూర్(67), సుందర్(62) అర్ధశతకాలతో రాణించారు. గబ్బా మైదానంలో ఏడో వికెట్‌కు 123 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి రికార్డు సృష్టించారు. ఠాకూర్ అవుటైన అనంతరం.. టీమ్ఇండియా మిగతా వికెట్లను వెంటవెంటనే కోల్పోయింది.
ఆసీస్ బౌలర్లలో హేజెల్‌వుడ్(5), స్టార్క్(2), కమిన్స్(2), లయన్ ఓ వికెట్ దక్కించుకున్నారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌటైంది.
ఇదీ చూడండి : గబ్బా టెస్టులో సుందర్, ఠాకూర్ రికార్డు భాగస్వామ్యం