ప్రపంచకప్‌లో కోహ్లీసేన ఇంగ్లండ్ చేతిలో మాత్రమే ఓడిపోతుంది... మిగతా అన్ని జట్లపైనా గెలుస్తుంది... వీటితో పాటే పక్కాగా సెమీస్ చేరుకుంటుంది... ఈ మాటలన్నది న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ మెక్కల్లమ్ ఈ టోర్నీలో మిగతా జట్లకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించాడు. ఈ ఫొటోను ఫేస్బుక్లో పంచుకున్నాడు.
ఈ మెగా ఈవెంట్లో ఆతిథ్య ఇంగ్లండ్, భారత్, ఆస్ట్రేలియా సెమీస్ చేరుకుంటాయని మెకకల్లమ్ అభిప్రాయపడ్డాడు. నాలుగో స్థానం కోసం న్యూజిలాండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ పోటీ పడతాయని చెప్పాడు.
లీగ్ దశలో ఇంగ్లండ్, టీమిండియా ఎనిమిదింటిలో గెలిచి ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఓడిపోతాయని చెప్పాడీ స్టార్ బ్యాట్స్‌మెన్. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన అఫ్గానిస్థాన్ కేవలం బంగ్లాదేశ్, శ్రీలంకపైన మాత్రమే గెలుస్తుందని పేర్కొన్నాడు. పాయింట్ల పట్టికలో చివరి స్థానాల్లో శ్రీలంక, బంగ్లాదేశ్ నిలుస్తాయని తెలిపాడు.
ఇదీ చదవండి: WC19: ప్రపంచకప్ బోణి ఆతిథ్య ఇంగ్లండ్‌దే