ETV Bharat / sports

హాగ్ వరల్డ్ ఎలెవన్: కోహ్లీని కాదని బాబర్​కు చోటు - బ్రాడ్​ హాగ్​ వరల్డ్​ టెస్టు ఎలెవన్​

అత్యుత్తమ క్రికెటర్లతో వరల్డ్​ బెస్ట్​ ఎలెవన్​​ను ప్రకటించాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్​ బ్రాడ్​ హాగ్. అందులో నలుగురు భారత క్రికెటర్లను ఎంపిక చేయగా.. కోహ్లీని జట్టులోకి తీసుకోలేదు. కోహ్లీని కాకుండా పాకిస్థాన్ క్రికెటర్ బాబర్​ అజామ్​ను జట్టులోకి తీసుకోవడానికి గల కారణాలను తెలియజేశాడు.

Brad Hogg picks world's best eleven in Test Format
హాగ్ వరల్డ్ ఎలెవన్: కోహ్లీని కాదని బాబర్​కు చోటు
author img

By

Published : May 23, 2020, 8:30 PM IST

అత్యుత్తమ క్రికెటర్లతో ఉత్తమ టెస్టు క్రికెట్​ జట్టును రూపొందించాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్​ బ్రాడ్ హాగ్. కానీ, అందులో టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీకి స్థానం కల్పించలేదు. మొత్తం నలుగురు భారత క్రికెటర్లకు చోటిచ్చాడు.

ఓపెనర్లుగా రోహిత్​ శర్మ.. ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​లో డబుల్​ సెంచరీ సాధించిన మయాంక్​ అగర్వాల్​తో పాటు 3,4 స్థానాల్లో లబుషేన్​, స్టీవ్ స్మిత్​లకు స్థానం కల్పించాడు. తర్వాత పాకిస్థాన్​ కెప్టెన్​ బాబర్​ అజామ్​, అజింక్య రహానె, క్వింటన్​ డికాక్​ ఉన్నారు. బౌలింగ్​లో ముగ్గురు పేసర్లు పాట్​ కమిన్స్​, మహ్మద్​ షమీ, నీల్​ వాగ్నర్​లను ఎంపిక చేశాడు. కెప్టెన్​గా డికాక్​ను నియమించాడు.

"కోహ్లీని జట్టులోకి ఎంపిక చేయకపోవడంపై పలువురు ప్రశ్నించే అవకాశం ఉంది. గత 15 టెస్టు ఇన్నింగ్స్​లో కేవలం నాలుగుసార్లు మాత్రమే అతను 31 పైగా పరుగులను సాధించాడు. అందుకే అతడికి జట్టులో స్థానం కల్పించలేదు. బాబర్​ అజామ్ గతేడాది​ ఆస్ట్రేలియా సిరీస్​లో శతకాన్ని సాధించాడు. విదేశీ గడ్డపై నిలకడ రాణించడం కష్టం. అందువల్ల బాబర్​ను ఎంపిక చేశా".

- బ్రాడ్​ హాగ్​, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్

బ్రాడ్​ హాగ్​ టెస్టు ఎలెవన్​

మయాంక్​ అగర్వాల్​, రోహిత్​ శర్మ, లబుషేన్​, స్టీవ్​ స్మిత్​, బాబర్ అజామ్​, అంజిక్య రహానె, క్వింటన్​ డికాక్​(కెప్టెన్​, వికెట్​ కీపర్​), పాట్​ కమిన్స్​, మహ్మద్​ షమీ, నీల్​ వాగ్నర్​, నాథన్​ లియోన్​.

ఇదీ చూడండి... అత్యధికంగా ఆర్జిస్తున్న మహిళా అథ్లెట్​గా ఒసాకా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.