ETV Bharat / sports

రహానె.. నీ వ్యూహం అద్భుతం: హాడిన్​

భారత తాత్కాలిక టెస్టు కెప్టెన్ రహానెపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాడిన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆటగాళ్లంతా గాయాలపాలవుతున్నా.. సమర్థవంతంగా జట్టును ముందుండి నడిపిస్తున్నాడని కొనియాడాడు.

Brad Haddin praises Rahane's "outstanding" captaincy
రహానె.. నీ వ్యూహం అద్భుతం
author img

By

Published : Jan 13, 2021, 8:53 AM IST

సిడ్నీ టెస్టులో టీమ్‌ఇండియా సారథిగా అజింక్య రహానె వ్యూహాలు అద్భుతంగా ఉన్నాయని ఆసీస్‌ మాజీ వికెట్‌కీపర్‌ బ్రాడ్‌ హాడిన్‌ అన్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో రిషబ్​ పంత్‌ను ముందుగా పంపించడం వల్ల భారత్‌ సులువుగా మ్యాచ్‌ను డ్రా చేయగలిగిందని ప్రశంసించాడు.

"రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా అద్భుతంగా ఆడింది. కేవలం డ్రా కోసం కష్టపడాల్సిన పరిస్థితి. అలాంటప్పుడు పంత్‌ను ముందుగా పంపించాలన్న రహానె తెలివితేటలు అద్భుతం. రిషబ్​ను ముందు పంపించి ఆటను ముందుకు తీసుకెళ్లాలని రహానె భావించాడు. పంత్‌ అలాగే చేశాడు. నిర్భయంగా ఆడి టిమ్‌ పైన్‌ కొన్ని నిర్ణయాల్లో మార్పులు చేసుకొనేలా ఆడాడు. అందుకే రహానె వ్యూహం గొప్పదని అంటున్నా."
- బ్రాడ్​ హాడిన్​, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్​

ధైర్యాన్ని నూరి పోశాడు..

Brad Haddin praises Rahane's
విహారిని అభినందిస్తున్న రహానె

రహానె సారథ్యంలో టీమ్ఇండియా ఒక్క మ్యాచ్​లోనూ ఓడిపోలేదని హాడిన్​ వెల్లడించాడు. అతడిలో ఉన్న ధైర్యాన్ని జట్టులోని ఆటగాళ్లకు నూరి పోశాడని తెలిపాడు. "విహారి కూడా పుజారాలాంటి ఆటగాడే. వాళ్ల స్వభావం ఆటను ముగించడం. వారు అచ్చం అలాగే చేశారు. రహానె సారథిగా ఒక్క మ్యాచూ ఓడిపోలేదు. టీమ్‌ఇండియాకు సిడ్నీలో అతడు ధైర్యాన్ని నూరిపోశాడు. ఆటగాళ్లు గాయాలపాలైనా పట్టుదలతో ఆడాడు. వారిలోని అంకితభావాన్ని ప్రదర్శించారు. వాళ్ల కెప్టెన్‌ లేడు. ముగ్గురు పేసర్లు మధ్యలోనే వెళ్లిపోయారు. జడేజా వేలు విరిగింది. అయినా వారు నిర్భయంగా క్రికెట్‌ ఆడాడు" అని హాడిన్‌ అన్నాడు.

ఇదీ చూడండి: ఆసీస్​తో నాలుగో టెస్టుకు అందుబాటులో సెహ్వాగ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.