స్పెయిన్ వేదికగా జరుగుతోన్న 35వ బక్సమ్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో భారత బాక్సర్లు మరో అడుగు ముందుకేశారు. అద్భుత విజయాలతో సతీష్ కుమార్, ఆశిష్ కుమార్ సెమీస్‌లోకి దూసుకెళ్లారు. 81 కేజీల విభాగంలో సుమిత్ సంగ్వాన్.. బెల్జియం బాక్సర్ మోహోర్ ఎల్ జియాద్పై 4-1 తేడాతో గెలిచి చివరి నాల్గో రౌండ్‌కు అర్హత సాధించాడు.
దేశం తరఫున అత్యధిక బరువుల విభాగంలో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన సతీష్ కుమార్(91+ కేజీలు).. డెన్మార్క్ బాక్సర్ నీల్సెన్పై 5-0తో విజయం సాధించాడు. ఆసియన్ సిల్వర్ పతక విజేత ఆశిష్ కుమార్(75 కేజీలు).. ఇటలీ ప్లేయర్ రెమో సాల్వట్టిపై 4-1తో గెలుపొంది పతకం ఖరారు చేసుకున్నాడు.
దీంతో మొత్తం 10 మంది భారత ఆటగాళ్లు(ఆరుగురు పురుషులు, నలుగురు మహిళలు) సెమీస్‌లోకి ప్రవేశించినట్లయింది. అంతకు ముందు జరిగిన పోటీల్లో భారత బాక్సర్లు మహమ్మద్ హుసాముద్దీన్(57 కేజీలు), మనీష్ కౌషిక్(63 కేజీలు), వికాస్ క్రిష్ణన్(69 కేజీలు) సెమీస్‌లోకి ప్రవేశించి పతకం ఖరారు చేసుకున్నారు. ఆరు సార్లు ప్రపంచ విజేత మేరీ కోమ్(51 కేజీలు), ఆసియన్ ఛాంపియన్ పూజా రాణి(75 కేజీలు), సిమ్రాన్‌జిత్ కౌర్(60 కేజీ), జాస్మిన్(57 కేజీలు) ఇప్పటికే సెమీస్‌కు అర్హత పొందారు.
ఇదీ చదవండి: బక్సమ్ టోర్నీ: మేరీకోమ్ మరింత ముందుకు