ETV Bharat / sports

భారత్​తో టెస్టు సిరీస్ యాషెస్​తో సమానం: స్టీవ్ వా - స్టీవ్ వా వార్తలు

భారత్​-ఆస్ట్రేలియా మధ్య జరిగే బోర్డర్​-గావస్కర్ ట్రోఫీ యాషెస్​తో సమానమని తెలిపాడు ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ వా. రెండు దీటైన జట్లు తలపడటం ఎప్పుడూ గొప్పగానే ఉంటుందని వెల్లడించాడు.

Border Gavaskar series is equivalent to Ashes: Steve Waugh
భారత్​తో టెస్టు సిరీస్ యాషెష్​ వంటిది: స్టీవ్ వా
author img

By

Published : Jul 10, 2020, 5:33 PM IST

Updated : Jul 10, 2020, 5:50 PM IST

ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య జరిగే సిరీస్​ను యాషెస్​గా అభివర్ణిస్తారు. దీనికి క్రికెట్ చరిత్రలో ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇరుజట్లు ఈ సిరీస్​ను దేశ ప్రతిష్ఠగా భావిస్తాయి. అయితే ఈ సిరీస్​లానే భారత్​తో జరిగే బోర్డర్​-గావస్కర్ సిరీస్​ కూడా గొప్పదని అంటున్నాడు ఆసీస్ దిగ్గజ కెప్టెన్ స్టీవ్ వా. ఆస్ట్రేలియాకు యాషెస్​ ఎంత ముఖ్యమో బోర్డర్-గావస్కర్ ట్రోఫీ కూడా అంతే ప్రధానమని తెలిపాడు.

"బోర్డర్-గావస్కర్ ట్రోఫీ.. యాషెస్​తో సమానం. రెండు దీటైన జట్ల మధ్య జరిగే పోరు ఇది. 1986లో జరిగిన టెస్టు (డ్రా అయింది) నా కెరీర్​లో అత్యుత్తమమైంది. 2001లో కోల్​కతాలో జరిగిన టెస్టు (ఇందులో ఆసీస్ ఓడిపోయింది) ఇప్పటికీ జ్ఞాపకముంది. నాకు భారత్​ అంటే చాలా ఇష్టం. అక్కడ క్రికెట్​తో నాకు విడదీయరాని బంధం ఉంది. అలాగే భారత్​లో క్రికెట్​ను ఎందుకు అంతలా ఆదరిస్తారు అనే అంశంపై ఓ పుస్తకాన్ని కూడా తీసుకొచ్చే ఆలోచన ఉంది."

-స్టీవ్ వా, ఆసీస్ మాజీ కెప్టెన్

భారత్-ఆస్ట్రేలియా మధ్య ఈ ఏడాది చివర్లో టెస్టు సిరీస్ జరగనుంది. డిసెంబర్ 11న అడిలైడ్ వేదికగా ఇరుజట్ల మధ్య డేనైట్ టెస్టు నిర్వహించనున్నారు.

Border Gavaskar series is equivalent to Ashes: Steve Waugh
భారత్-ఆస్ట్రేలియా

యాషెస్​కు ఆ పేరెలా వచ్చింది?

ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా జట్లు యాషెస్​ సిరీస్​ను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తాయి. కానీ దీనికి ఈ పేరెలా వచ్చిందో తెలుసుకుందాం. 1882లో ఇంగ్లాండ్​లోని ఓవల్ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ తలపడ్డాయి. ఈ మ్యాచ్​లో ఆసీస్ ఘనవిజయం సాధించింది. ఇదే ఇంగ్లీష్ గడ్డపై కంగారూ జట్టుకు తొలి టెస్టు విజయం. అయితే దీనిపై వెటకారంగా ఓ బ్రిటీష్ పత్రిక ఇలా వార్త రాసింది. "ఇంగ్లాండ్ క్రికెట్ చచ్చిపోయింది. భౌతిక దేహం తగలబడిపోయింది. బూడిద (యాష్)ను ఆస్ట్రేలియాకు తీసుకెళ్లారు." ఇది దాని సారాంశం. అప్పటి నుంచి దీనిని యాషెస్​గా పిలుస్తున్నారు.

Last Updated : Jul 10, 2020, 5:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.