'బీసీసీఐ వర్సెస్ బిహార్ క్రికెట్ అసోసియేషన్' కేసును విచారించింది సుప్రీం కోర్టు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఏ బోబ్డే అధ్యక్షతన ఈ కేసుపై విచారణ జరిగింది. రెండు వారాలు పాటు దీనిని వాయిదా వేస్తూ.. అప్పటివరకు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, సెక్రటరీ జైషా తమ పదవుల్లో కొనసాగాలని స్పష్టం చేసింది.
తొమ్మిది నెలల్లోనే...
బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, సెక్రటరీ షా పదవీకాలాన్ని 2025 వరకు పొడిగించాలని ఏప్రిల్ 21న అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది బీసీసీఐ. 2019 అక్టోబర్‌లో వీరిద్దరూ పదవులు చేపట్టారు. అయితే లోథా కమిటీ సంస్కరణల్లో భాగంగా విధించిన కూలింగ్ పీరియడ్‌తో వీరు కేవలం తొమ్మిది నెలలు మాత్రమే పదవిలో కొనసాగేందుకు వీలుంది. ఎవరైనా ఆరేళ్ల పాటు రాష్ట్ర సంఘాలు లేదా బీసీసీఐలో పనిచేస్తే కచ్చితంగా మూడేళ్ల పాటు మళ్లీ మరో పదవి అధిరోహించేందుకు వీలులేదు. గతంలో గంగూలీ బంగాల్ అసోసియేషన్లోనూ, షా గుజరాత్ క్రికెట్ అసోసియేషన్లోనూ దాదాపు ఐదేళ్లకు పైగా పనిచేశారు.
ఇది చూడండి : గంగూలీ, జైషా భవితవ్యం తేలేది నేడే...!