ETV Bharat / sports

ఆసీస్​తో చివరి టెస్టు: టీ విరామానికి భారత్ 253/6​

author img

By

Published : Jan 17, 2021, 10:24 AM IST

ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు మూడో రోజు ఆటలో టీ విరామ సమయానికి టీమ్​ఇండియా తొలి ఇన్నింగ్స్​లో 6 వికెట్లు కోల్పోయి 253 పరుగులు చేసింది. క్రీజులో సుందర్​ (38), శార్దూల్​ ఠాకూర్​ (33)ఉన్నారు.

panth
పంత్​

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న చివరిదైన నాలుగో టెస్టులో టీమ్​ఇండియా ఆసీస్​ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటోంది. మూడో రోజు ఆటలో టీ బ్రేక్​ సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు కోల్పోయి 253 పరుగులు చేసింది.

భోజన విరామం తర్వాత తొలి ఓవర్‌లోనే మయాంక్‌ అగర్వాల్‌(38; 75 బంతుల్లో 3x4, 1x6) ఔటయ్యాడు. హేజిల్‌వుడ్‌ వేసిన 60 ఓవర్​ రెండో బంతికి స్లిప్‌లో స్టీవ్‌స్మిత్‌ చేతికి చిక్కాడు. దీంతో భారత్‌ 161 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత రిషభ్ పంత్‌(23) కూడా హేజిల్​వుడ్​ బౌలింగ్​లోనే 186 పరుగుల వద్ద ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. హేజిల్​వుడ్​ బౌలింగ్​లోనే మూడో స్లిప్‌లో గ్రీన్‌ చేతికి చిక్కాడు.

ప్రస్తుతం క్రీజులో ఉన్న సుందర్​(38), శార్దూల్​ ఠాకూర్​(33) ఆచితూచి ఆడుతున్నారు. ఏడో వికెట్​కు 67 పరుగులు జోడించారు. ఆసీస్​ తొలి ఇన్నింగ్స్​లో 369 పరుగులకు ఆలౌట్​ అయింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.