ETV Bharat / sports

'బయోబబుల్​ కష్టమే.. మనోళ్లకు కాదులే' - బయోబబుల్​ను భారత ఆటగాళ్లు ఎదుర్కోలరన్న గంగూలీ

బయోబబుల్​లో ఆడటం విదేశీ జట్లకు కష్టతరం కానీ భారత ఆటగాళ్లకు కాదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్​ గంగూలీ అభిప్రాయపడ్డాడు. బయోబబుల్​లో మానసిక సమస్యలను ఎదుర్కోవటంలో భారత ఆటగాళ్లు సహనపరులని అన్నాడు.

ganguli said indian criketers more tolarent
బయో బబుల్​ కష్టతరమేనన్న గంగూలీ
author img

By

Published : Apr 6, 2021, 4:04 PM IST

బయోబబుల్​లో మానసిక సమస్యలను ఎదుర్కోవటంలో ఇతర దేశాల ఆటగాళ్లతో పోల్చితే భారత ఆటగాళ్లు సహనపరులని బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్​ గంగూలీ అభిప్రాయపడ్డాడు. కొవిడ్​ దృష్ట్యా బయోబబుల్​లో ఉండటం ఎవరికైనా కష్టతరమేనని అన్నాడు.

'గత ఆరు నెలలుగా బయోబబుల్​లో ఆడటం కష్టతరమే. కేవలం మైదానం నుంచి హోటల్​ గదికి మాత్రమే పరిమితం కావటం విభిన్నమైన జీవితమే. విదేశీ ఆటగాళ్ల కన్నా భారత ఆటగాళ్లకు భరించే శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా​, వెస్ట్​ఇండీస్​తో నేను ఎన్నోసార్లు ఆడాను. వారు మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోరు' అని కోల్​కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించాడు గంగూలీ.

స్వదేశీ గడ్డ​పై భారత్​ చేతిలో ఓటమి పాలైన ఆస్ట్రేలియా​.. దక్షిణాఫ్రికా పర్యటన​ను రద్దు చేసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ఉదహరించాడు గంగూలీ. ఆటగాళ్లు పాజిటివ్​గా ఉండాలని సూచించారు.

బయోబబుల్​లో ఎదుర్కొంటున్న మానసిక పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసినవారిలో భారత కెప్టెన్​ విరాట్​ కోహ్లి కూడా ఒకరు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.