ETV Bharat / sports

'కోహ్లీ లాంటి లక్షణాలే బెన్​స్టోక్స్​లోనూ'

ఆల్​రౌండర్​ ​స్టోక్స్​కు​ కోహ్లీలా జట్టును ముందుండి నడిపించే లక్షణముందని ఇంగ్లాండ్​ టెస్టు కెప్టెన్​ జో రూట్ ప్రశంసించాడు​. త్వరలో వెస్టిండీస్​తో జరగబోయే టెస్టు సిరీస్​లో కెప్టెన్​గా అతడు​ అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాడని భావిస్తున్నట్లు చెప్పాడు.

Ben would lead from the front like Virat: Root
'కోహ్లీ నాయకత్వ లక్షణాలే బెన్​స్టోక్స్​లో ఉన్నాయి'
author img

By

Published : Jun 17, 2020, 8:42 PM IST

టీమ్​ఇండియా కెప్టెన్​ కోహ్లీ లాంటి లక్షణాలను ఆల్​రౌండర్​ బెన్​ స్టోక్స్​లోనూ చూస్తానని ఇంగ్లాండ్ టెస్టు జట్టు కెప్టెన్ జో రూట్​ అభిప్రాయపడ్డాడు. జులై 8 నుంచి వెస్టిండీస్​తో జరిగే మూడు టెస్టుల సిరీస్​కు జో రూట్​ దూరమవుతున్నాడు. ఇందువల్ల​ స్టోక్స్​ సారథ్య బాధ్యతలు స్వీకరించాల్సిన అవసరం రావొచ్చని తెలుస్తోంది.

"కోహ్లీ తన జట్టు కోసం ఎలాంటి ప్రదర్శన చేస్తాడో అందరూ తమ జట్టు కోసం అలానే చేయాలనుకుంటారు. విరాట్​లాగే స్టోక్స్, తన బాధ్యత కచ్చితంగా నిర్వర్తిస్తాడని అనుకుంటున్నా. బెన్ నా కంటే గొప్పగా కెప్టెన్సీ చేస్తాడని నా నమ్మకం. జట్టును ముందుండి నడిపించడం లాంటి గొప్ప లక్షణం అతడిలో ఉంది. ఇప్పటికే వైస్​ కెప్టెన్​గా స్టోక్స్​పై అందరికి చాలా గౌరవం ఉంది. జులైలో జరగబోయే టెస్టు సిరీస్​లో తాను అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాడని నమ్ముతున్నా"

-జో రూట్​, ఇంగ్లాండ్​ కెప్టెన్​

జులైలో జో రూట్​ భార్య క్యారీ, రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్న కారణంగా విండీస్​తో తొలి రెండు మ్యాచ్​లకు అతడు దూరమయ్యే అవకాశముంది. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్​ జట్టుకు కెప్టెన్​గా బెన్​స్టోక్స్​ వ్యవహరించనున్నట్లు సమాచారం.

కరోనా సంక్షోభం తర్వాత జరగబోయే తొలి అంతర్జాతీయ క్రికెట్ సిరీస్ ఇదే​ కావడం వల్ల క్రికెట్​ అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇందులో ఐసీసీ తాజా మార్గదర్శకాలను ఏ విధంగా అమలు చేస్తారనే విషయమై చర్చ నడుస్తోంది. వాటిలో ముఖ్యంగా బంతిపై లాలాజలం నిషేధాన్ని, బౌలర్లు ఎలా పాటిస్తారోనని అన్ని దేశాల బోర్డులు ఎదురుచూస్తున్నాయి.

ఇదీ చూడండి... వైద్యుడ్ని సస్పెండ్​ చేసిన చెన్నై సూపర్ కింగ్స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.