ETV Bharat / sports

'ప్రస్తుత క్రికెట్​లో బెన్ స్టోక్స్ అత్యుత్తమ ఆల్​రౌండర్'

author img

By

Published : Jul 18, 2020, 4:15 PM IST

ఇంగ్లాండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్ ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలోనూ అత్యుత్తమ ఆల్​రౌండర్ అని అభిప్రాయపడ్డాడు టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా. వెస్టిండీస్​పై జరుగుతోన్న రెండో టెస్టులో సెంచరీతో సత్తాచాటాడు స్టోక్స్.

'ప్రస్తుత క్రికెట్​లో బెన్ స్టోక్స్ అత్యుత్తమ ఆల్​రౌండర్'
'ప్రస్తుత క్రికెట్​లో బెన్ స్టోక్స్ అత్యుత్తమ ఆల్​రౌండర్'

ప్రస్తుతం ఉన్న క్రికెటర్లలో ఇంగ్లాండ్​ ఆటగాడు బెన్ స్టోక్స్ అత్యుత్తమ ఆల్​రౌండర్ అని అభిప్రాయపడ్డాడు టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా. వెస్టిండీస్​తో జరుగుతోన్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో సెంచరీతో ఇంగ్లీష్​ జట్టుకు ఆధిక్యాన్ని ఇచ్చాడు స్టోక్స్. ఈ సందర్భంగా ఆకాశ్ ఈ విధంగా స్పందించాడు.

"ప్రస్తుత సమయంలో బెన్ స్టోక్స్ అత్యుత్తమ ఆల్​రౌండర్. అందులో ఎలాంటి సందేహం లేదు. అన్ని ఫార్మాట్లలోనూ అతడే ఉత్తమం. టెస్టుల్లో 43, వన్డేల్లో 59 సగటుతో అతడు అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. అలాగే బౌలింగ్​లోనూ సత్తాచాటుతున్నాడు. షకిబుల్ హసన్, రవీంద్ర జడేజాలు తర్వాత స్థానాల్లో ఉంటారు."

-ఆకాశ్ చోప్రా, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్

వెస్టిండీస్​తో జరుగుతోన్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో స్టోక్స్ 356 బంతులాడి 176 పరుగులు చేశాడు. టెస్టు కెరీర్​లో ఇతడికి ఇది 10వ శతకం. విండీస్​పై రెండోది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.