ETV Bharat / sports

'అందరితో ఒకలా.. నాతో మాత్రం మరోలా ఎందుకు?' - kaneria latest news updates

పాక్ బోర్డు తన వివక్ష చూపుతుందని, అందరిలా చూసినట్లు తనను చూడటం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు దినేశ్ కనేరియా. నిషేధం విషయంలో మిగిలిన వాళ్లతో పోలిస్తే తనను వేరేలా చూస్తోందని చెప్పాడు.

Danish Kaneria
కెనేరియా
author img

By

Published : Aug 8, 2020, 1:30 PM IST

ఇటీవలే కాలంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై విరుచుకుపడుతున్న ఆ దేశ క్రికెటర్ దినేశ్ కనేరియా.. మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశాడు. 2012లో మ్యాచ్​ ఫిక్సింగ్​కు పాల్పడినందుకు ఇతడిపై శాశ్వత నిషేధం విధించారు. ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతర ఆటగాళ్లకు శిక్షలు తగ్గించి, క్రికెట్​లోకి తిరిగి అనుమతిస్తున్నారని.. తన విషయంలో మాత్రం ఎందుకు ఇలా చేయడం లేదని ప్రశ్నించాడు.

"అవినీతికి పాల్పడితే ఎటువంటి తారతమ్యాలు చూడమని చెప్పారు. ఉమర్​ అక్మల్​ ఈ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. కానీ అతనిపై ఉన్న నిషేధంపై సడలింపులు విధించి శిక్ష తగ్గించారు. ఆమిర్​, ఆసిఫ్​, సల్మాన్​లకూ తిరిగి క్రికెట్​ ఆడేందుకు అనుమతినిచ్చారు. మరి నన్నెందుకు వదిలేయడం లేదు? సడలింపులు ఎందుకు కల్పించడం లేదు? నాపై వివక్ష చూపుతున్నారని ఇక్కడే స్పష్టంగా తెలిసిపోతోంది"

దినేశ్​ కనేరియా, పాక్​ క్రికెటర్​

"నా దేశం కోసం ఆడటం, ఓ హిందూ క్రికెటర్​గా పాక్​ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం ఎంతో సంతోషంగా ఉంటుంది. నా జట్టును గెలిపించినప్పుడు అది నేను సాధించిన విజయంలా అనిపిస్తుంది. నా మతాన్ని అడ్డుపెట్టుకుని ఆడుతున్నానని అందరూ అంటారు. కానీ నేనైతే ఎప్పుడూ అలా అనుకోలేదు. సమస్యంతా పాక్​ బోర్డుతోనే. అందరి ఆటగాళ్లతో పీసీబీ ప్రవర్తన చాలా బాగుంది. నా విషయానికి వచ్చేసరికి పక్కకు తోసేస్తున్నారు. ఇది చాలా బాధ కలిగించింది" -కనేరియా, పాక్ క్రికెటర్

పాకిస్థాన్ తరఫున 61 టెస్టుల్లో 261 వికెట్లు పడగొట్టాడు కనేరియా. 18 వన్డేలాడి 15 వికెట్లు తీశాడు. అనిల్​ దల్​పత్​​ తర్వాత పాక్​ జట్టు తరఫున ఆడిన రెండో హిందూ కనేరియానే.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.