ETV Bharat / sports

బీసీసీఐ-నాడా బంధంపై క్రీడా శాఖ మంత్రి హర్షం - Sports minister Rijiju

బీసీసీఐ, నాడాతో కలవడంపై సంతోషం వ్యక్తం చేశారు కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజుజు. క్రికెట్​లో పారదర్శకతను పెంపొందించేందుకు ఈ నిర్ణయం చాలా ఉపకరిస్తుందని అన్నారు.

కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజుజు
author img

By

Published : Aug 10, 2019, 3:08 PM IST

ఎట్టకేలకు జాతీయ డోపింగ్​ నిరోధక సంస్థ(నాడా)తో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఒప్పందం కుదుర్చుకోవడాన్ని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజుజు స్వాగతించారు. క్రికెట్​లో పారదర్శకతను పెంపొందించేందుకు, అభివృద్ధికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుందన్నారు.

"సమస్యలు ఉంటే నాకు నచ్చదు. వాటిని స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవాలి. ఎందుకంటే ఆటల్లోనూ, ఆడేవారిలోనూ పారదర్శకత ఉండాలని నేను నమ్ముతాను" -కిరణ్ రిజుజు, కేంద్ర క్రీడా శాఖ మంత్రి

నాడా పరిదిలోకి వచ్చేందుకు బీసీసీఐ ఎప్పటినుంచో అభ్యంతరం తెలుపుతోంది. కారణం తన స్వయం ప్రతిపత్తిని కోల్పోతుందేమోనని భయం. ప్రముఖ క్రికెటర్లూ ఈ విషయంపై అడ్డు చెపుతున్నారు. వ్యక్తిగత సమాచారంతో వారి గోప్యతకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని వారి ఆందోళన.

బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీ, క్రీడా సెక్రటరీ రాధే శ్యామ్​ మధ్య శుక్రవారం జరిగిన భేటీ అనంతరం నాడా విషయంలో సానుకూలంగా నిర్ణయం తీసుకుంది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు.

ఈ ఒప్పందం ప్రకారం నాడా పిలిచే సమయానికి క్రీడాకారులందరూ అందుబాటులో ఉండాలి. అలా కాకపోతే నిషేధం ఎదుర్కోవాలి. ఇలాంటి చాలా విషయాలపై బీసీసీఐ ముందు వ్యతిరేకత చూపించినా చివరకు అంగీకారం తెలిపింది.

ఇదీ చూడండి: వాలీబాల్​ ఫైట్​: పాక్​తో అమీతుమీకి భారత్​ సిద్ధం

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.