ఐపీఎల్లో పాల్గొనే క్రికెటర్లు సహా మిగితా సహాయక సిబ్బందికి 20వేలకు పైగా కరోనా టెస్టులను నిర్వహించనున్నట్లు ఇటీవల బీసీసీఐ తెలిపింది. వీటికోసం రూ.10కోట్ల రూపాయల నిధులను కేటాయించినట్లు ప్రకటించింది. ఆగస్టు 20-28 తేదీల మధ్య 1988 కరోనా టెస్టులు చేసినట్లు తెలిపింది.
ఇప్పటికే వైరస్ బారిన పడ్డవారికి ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించింది బోర్డు. ఆటగాళ్ల పర్యవేక్షణ కోసం 75మంది ఆరోగ్య కార్యకర్తలను అందుబాటులో ఉంచినట్లు స్పష్టం చేసింది. మొత్తంగా వారి భద్రత పై మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.
సీఎస్కే జట్టులో ఇటీవల ఇద్దరు ఆటగాళ్లు సహా 13మంది కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం వీరంతా క్వారంటైన్లో ఉన్నారు. మిగతా జట్లు క్వారంటైన్ పూర్తి చేసుకుని ప్రాక్టీసు సెషన్లో పాల్గొన్నాయి.
ఇది చూడండి సీఎస్కేకు ఊరట.. వారికి కరోనా నెగిటివ్!