ETV Bharat / sports

మార్చి నుంచి మహిళల దేశవాళీ క్రికెట్​! - దేశవాళీ క్రికెట్​ తుది నిర్ణయం

ఈ సీజన్​ రంజీ లేక విజయ్​ హజారె.. ఈ రెండింటిలో ఏది నిర్వహించాలా అనే విషయమై వచ్చే వారం ఆఖర్లో జరగబోయే బీసీసీఐ అపెక్స్​ కౌన్సిల్​ సమావేశంలో తేలనుంది. అలాగే మహిళల దేశవాళీ క్రికెట్​ సీజన్​ను మార్చిలో ఆరంభించాలని బీసీసీఐ యోచిస్తోంది.

bcci
బీసీసీఐ
author img

By

Published : Jan 18, 2021, 7:11 AM IST

మహిళల దేశవాళీ క్రికెట్​ సీజన్​ను ఈ మార్చిలో ఆరంభించాలని బీసీసీఐ భావిస్తోంది. ఆదివారం జరిగిన బోర్డు అపెక్స్​ కౌన్సిల్​ సమావేశంలో ఈ విషయంపై చర్చించినట్లు సమాచారం. కానీ ఈసారి రంజీ ట్రోఫీ నిర్వహించాలా లేదా విజయ్​ హజారేతో సర్దుబాటు చేయాలా అన్న విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. వీలైనంత త్వరగా రంజీ ట్రోఫీ నిర్వహించాలని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ పట్టుదలతో ఉన్నాడు. కానీ కొంత మంది సభ్యులు మాత్రం విజయ్​ హజారెకు ఓటు వేస్తున్నారు.

"రంజీ ట్రోఫీని యథావిధిగా నిర్వహించాలని అధ్యక్షుడు గంగూలీ భావిస్తున్నాడు. కానీ దీనికి బదులు విజయ్​ హజారె నిర్వహిస్తే మేలని కొందరి అభిప్రాయం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వివిధ వేదికల్లో రంజీ ట్రోఫీ నిర్వహణ సాధ్యాసాధ్యాలపై చర్చలు జరిగాయి. రంజీనా లేక విజయ్​ హజారేనా అనేది వచ్చే వారం చివర్లో తేలనుంది. అయితే మహిళల దేశవాళీ క్రికెట్​ మార్చిలో ఆరంభమయ్యే అవకాశాలున్నాయి." అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

ఇదీ చూడండి: బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్​ శుక్లాపై ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.