లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందిపడుతున్న పేదలకు సాయం చేసేందుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ముందుకొచ్చాడు. ఇస్కాన్ (కోల్‌కతా)తో కలిసి తన ట్రస్టు ద్వారా అతడు రోజుకు 10 వేల మంది కడుపు నింపనున్నాడు. ఇప్పటికే రోజుకు 10 వేల మంది ఆకలి తీరుస్తున్న ఈ సంస్థకు తాజాగా సౌరభ్ వితరణతో మరో పది వేల మందికి అన్నం పెట్టే అవకాశం లభించింది.
-
Thank u ISKCON .. keep serving the society https://t.co/alXyabQVcR
— Sourav Ganguly (@SGanguly99) April 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Thank u ISKCON .. keep serving the society https://t.co/alXyabQVcR
— Sourav Ganguly (@SGanguly99) April 4, 2020Thank u ISKCON .. keep serving the society https://t.co/alXyabQVcR
— Sourav Ganguly (@SGanguly99) April 4, 2020
"కోల్‌కతా ఇస్కాన్ తరఫున ప్రతిరోజూ 10 వేల మంది అన్నార్తుల కోసం భోజనాలు సిద్ధం చేస్తాం. మా ప్రియతమ గంగూలీ ముందుకొచ్చి విరాళం ఇవ్వడం వల్ల మరో 10 వేల మందికి అన్నం పెట్టే అవకాశం దక్కింది" అని ఇస్కాన్ పేర్కొంది. గంగూలీ ఇంతకుముందు కరోనా బాధితుల కోసం రూ.50 లక్షల విలువైన బియ్యాన్ని సాయంగా అందించాడు.
ఇదీ చూడండి.. కరోనాపై పోరుకు ఇంగ్లాండ్ క్రికెటర్ల భారీ విరాళం