ETV Bharat / sports

'బాగా ఆడితే హీరోలా చూస్తారు.. కానీ ఇప్పుడు' - 'అందుకే యువ క్రికెటర్లలో ఆ నిర్భీతి'

యువ ఆటగాళ్లు నిర్భీతిగా ఉండటానికి గల కారణాలను వెల్లడించాడు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ. జీవితంలోని వివిధ కోణాలను వారు స్పృషించడం వల్లే ఇది సాధ్యమైందని తెలిపాడు. రిషభ్ పంత్​, హార్దిక్ పాండ్య వంటి క్రికెటర్లు ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నాడు. దేశంలో బాగా ఆడితే హీరోలా చూస్తారని, ఇప్పుడు అనుభూతిని కోల్పోతున్నట్లు తెలిపాడు.

sourav ganguly, bcci president
సౌరభ్​ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు
author img

By

Published : Apr 14, 2021, 6:48 AM IST

జీవితంలో వివిధ కోణాలను స్పృషించడం వల్లే రిషభ్​ పంత్, హార్దిక్​ పాండ్య లాంటి ఈ తరం క్రికెటర్లు నిర్భీతిగా ఉంటున్నారని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ తెలిపాడు.

"నవ తరానికి జీవితంలో చాలా విషయాల పట్ల అవగాహన వస్తోంది. వాళ్లు నిర్భయంగా తయారు కావడానికి అది ఉపయోగపడుతోంది. ఎందుకంటే చాలా వనరులు అందుబాటులో ఉన్నాయని వాళ్లు అర్థం చేసుకుంటున్నారు. కృషి చేస్తే, పట్టుదలగా ప్రయత్నిస్తే తప్పక విజయవంతమవుతారు. అందుకే వాళ్లలో భయం ఉండట్లేదు" అని గంగూలీ పేర్కొన్నాడు.

ఇదీ చదవండి: రాజస్థాన్​కు షాక్.. సీజన్​ మొత్తానికి అతడు​ దూరం!

పంత్​, పాండ్యల గురించి అతడు ప్రత్యేకంగా ప్రస్తావించాడు. "ప్రస్తుత భారత జట్టునే చూడండి. పంత్​, పాండ్య, ఇంకొందరు కుర్రాళ్లు పూర్తి సంసిద్ధతో అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టారు. నైపుణ్య పరంగానే కాదు మానసికంగానూ వాళ్లు సిద్ధంగా ఉన్నారు. అది చాలా ముఖ్యం" అని గంగూలీ అభిప్రాయపడ్డాడు.

టెస్టు మ్యాచ్​కు సిద్ధమయ్యే క్రమంలో ఉదయం 7 గంటలకు కలిగే ఉద్విగ్నత లేకపోవడం ఇప్పుడు వెలితిగా అనిపిస్తోందని గంగూలీ చెప్పాడు. "ఉదయాన్నే లేచి టెస్టు మ్యాచ్​ కోసం దుస్తులు, షూస్​ వేసుకుంటుంటే.. బాగా రాణించాలనే ఒత్తిడి ఉండేది. బాగా ఆడితే సాయంత్రం 4.30 కల్లా దేశంలో అందరూ నన్ను హీరోలా చూస్తారని నాకు తెలుసు. ఆ సవాల్​ ఇప్పుడు లేదు. ఆ ఒత్తిడీ లేదు. అవి లేకపోవడం నాకు లోటే" అని దాదా అన్నాడు. అప్పుడప్పుడు ఒత్తిడికి గురి కావడం వల్ల మంచి క్రికెటర్​గా ఎదగడానికది ఉపయోగపడుతుందని వెల్లడించాడు.

ఇదీ చదవండి: హైదరాబాద్​తో ఆర్సీబీ ఢీ.. గెలుపు ఎవరిదో?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.