వచ్చే ఏడాది భారత్లో పర్యటనకు జింబాబ్వే స్థానంలో శ్రీలంక రానుంది. ఆఫ్రికా జట్టుపై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిషేధం విధించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. జనవరిలో లంక జట్టుతో టీమిండియా మూడు టీ20లు ఆడనున్నట్లు చెప్పింది.
"జింబాబ్వే జట్టు అంతర్జాతీయ మ్యాచ్లు ఆడకుండా ఐసీసీ నిషేధం విధించింది. ఈ కారణంగా భారత్తో మూడు టీ-20 మ్యాచ్లు ఆడేందుకు శ్రీలంక జట్టును ఆహ్వానించాం. లంక జట్టు ఇందుకు సుముఖత వ్యక్తం చేసింది" -బీసీసీఐ ప్రకటన
గువహటి వేదికగా జనవరి 5న ఇరు జట్ల మధ్య తొలి టీ20 జరగనుంది. జనవరి 7న ఇండోర్లో రెండో మ్యాచ్, జనవరి 10 పుణె వేదికగా మూడో మ్యాచ్ నిర్వహిస్తారు.
జింబాబ్వే క్రికెట్ బోర్డు అంతర్గత విషయాల్లో ఆ దేశ ప్రభుత్వం మితిమీరిన జోక్యం కారణంగా, జులైలో ఆ జట్టుపై ఐసీసీ నిషేధం విధించింది.
ఇదీ చదవండి: జింబాబ్వే క్రికెట్ జట్టుపై ఐసీసీ నిషేధం