ETV Bharat / sports

ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీ ధర చూస్తే షాకవ్వాల్సిందే!

author img

By

Published : Jan 6, 2021, 8:19 PM IST

ఐపీఎల్​-2022లో జట్ల సంఖ్య 8 నుంచి 10కి పెరగనుంది. అలాగే కొత్త ఫ్రాంచైజీల ధర కూడా భారీ స్థాయిలో ఉండనుందట. ఒక్కో ఫ్రాంచైజీ ధర దాదాపు రూ.1500-1600 కోట్లు ఉంటుందని సమాచారం.

BCCI hints at base price for new teams in IPL 2022
ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీ ధర చూస్తే షాకవ్వాల్సిందే!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ అంటేనే రికార్డుల మోత. ఆట పరంగానే కాదు ఆదాయ పరంగానూ ఐపీఎల్‌కు సాటిరాగల క్రికెట్‌ లీగ్‌ ప్రపంచంలో మరొకటి లేదు. ప్రత్యక్ష ప్రసార హక్కుల నుంచి ప్రకటనల వరకు బీసీసీఐ విపరీతంగా ఆర్జిస్తోంది. ప్రస్తుతం ఎనిమిది జట్లతో అలరిస్తున్న ఈ లీగ్‌ 2022కు పది జట్లకు పెరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఆ ఫ్రాంచైజీల కనీస ధర కూడా భారీ స్థాయిలోనే ఉండబోతోందని సమాచారం.

గతేడాది డిసెంబర్లో జరిగిన బీసీసీఐ సాధారణ వార్షిక సమావేశం (ఏజీఎం)లో కొత్త ఫ్రాంచైజీల గురించి సభ్యులు అనధికారికంగా చర్చించారని బీసీసీఐలోని ఓ అధికారి మీడియాకు తెలిపారు. ఒక్కో ఫ్రాంచైజీ కనీస ధర రూ.1500-1600 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. ఐపీఎల్‌ బ్రాండ్‌ విలువ, మిగిలిన ఫ్రాంచైజీల పెరిగిన విలువను పరిగణనలోకి తీసుకుంటే ఇది తక్కువ మొత్తమేనని అన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే టెండర్లు ఆహ్వానిస్తారని వెల్లడించారు.

"కనీస ధరపై అధికారికంగా ఇంకేమీ చర్చించలేదు. బీసీసీఐ ఏజీఎం సమయంలో మాత్రం అనధికారికంగా మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఐపీఎల్‌ ఫ్రాంచైజీ యాజమాన్యం అంటే ఖరీదైన ఆస్తిలాంటిది. పెరిగిన విలువను పరిగణనలోకి తీసుకుంటే కనీస ధర రూ.1500 కోట్ల కన్నా తక్కువ ఉండదు. టెండర్ల కాల ప్రకియ, కనీస ధరను ఐపీఎల్‌ పాలక మండలి నిర్ణయిస్తుంది. 2018లో దిల్లీ క్యాపిటల్స్‌లో 50% వాటాను జేఎస్‌డబ్ల్యూ రూ.1100 కోట్లకు కొనుగోలు చేసింది. ఏటా ఫ్రాంచైజీల విలువ పెరుగుతుందని మాకు తెలుసు. త్వరలో నిర్వహించే మీడియా హక్కుల టెండర్‌ ఆ విలువను మరింత పెంచుతుంది" అని ఆ అధికారి తెలిపారు.

ఇవీ చూడండి: బీసీసీఐ ఆదాయం పైపైకి.. రూ.5 వేల కోట్లు ఎక్కువ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.