ETV Bharat / sports

వచ్చే ఏడాది ఐపీఎల్ కూడా​ అక్కడేనా!

రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి యూఏఈ క్రికెట్ బోర్డు, బీసీసీఐ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ముందు ముందు భారత్​లో కరోనా ప్రభావం తగ్గకపోతే స్వదేశంలో ఆడాల్సిన సిరీస్​లకు యూఏఈ ప్రత్యామ్నాయ వేదిక అవుతుంది.

author img

By

Published : Sep 20, 2020, 6:39 AM IST

BCCI Considering Hosting England IPL 2021 in UAE
వచ్చే ఏడాది ఐపీఎల్ కూడా​ అక్కడేనా!

రెండు దేశాల మధ్య క్రికెట్‌ సంబంధాలను బలోపేతం చేసుకోవడం కోసం బీసీసీఐ, యూఏఈ క్రికెట్‌ బోర్డు అవగాహన ఒప్పందం, ఆతిథ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం ముందు ముందు భారత్‌లో కరోనా ఉధృతి తగ్గకపోతే.. భారత్‌ సొంతగడ్డపై ఆడాల్సిన సిరీస్‌లకు యూఏఈ ప్రత్యామ్నాయ వేదిక అవుతుంది. యూఏఈతో ఒప్పందాల గురించి బీసీసీఐ కార్యదర్శి జై షా ట్విట్టర్లో వెల్లడించాడు. అధికారికంగా ధ్రువీకరించలేదు కానీ భారత్‌లో కరోనా పరిస్థితులు మెరుగుపడకపోతే ఒప్పందం ప్రకారం.. వచ్చే ఆరు నెలల్లో జరగాల్సిన 2021 ఐపీఎల్‌ను యూఏఈలో నిర్వహించే అవకాశముంది.

"రెండు పెద్ద ఈవెంట్లు ఉన్నాయి. ఇంగ్లాండ్‌తో సిరీస్‌ను ఇప్పటికీ భారత్‌లోనే నిర్వహించాలని అనుకుంటున్నారు. కానీ జనవరిలో కూడా పరిస్థితుల్లో మార్పు రాకపోతే సిరీస్‌ను యూఏఈలో నిర్వహించాలన్నది బోర్డు ఆలోచన. 2021 ఐపీఎల్‌ విషయంలోనూ ఇదే ఉద్దేశంతో ఉంది" అని ఓ బీసీసీఐ సీనియర్‌ అధికారి చెప్పాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.