దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఐపీఎల్ వాయిదా పడే అంశంపై బీసీసీఐ వర్గాలు స్పందించాయి. టోర్నీ ప్రారంభమయ్యేందుకు ఇంకా సమయముందని, వాయిదా అంశంపై ఇంతవరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నాయి. ప్రస్తుతం పరిస్థితిని సమీక్షిస్తున్నామని, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొన్నాయి. దీంతో ఐపీఎల్ 13వ సీజన్ జరుగుతుందా? లేదా? అనే ఉత్కంఠ నెలకొంది.
షెడ్యూల్ ప్రకారం ఈనెల 29 నుంచి ఐపీఎల్ ప్రారంభం కావాల్సి ఉంది. తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. ఇప్పటికే పలువురు క్రికెటర్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు.
ఇదీ చూడండి: బుల్లి పఠాన్‌తో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ బాక్సింగ్