బీసీసీఐ టైటిల్ స్పాన్సర్‌గా పేటీఎం మరోసారి అవకాశం దక్కించుకుంది. ఐదేళ్ల కాలానికి ఒక్కో మ్యాచ్‌కు రూ.3.80 కోట్ల బిడ్ వేసి హక్కులు పొందింది. 2019-23 హోం సీజన్‌కు రూ.326.80 కోట్లతో టైటిల్ స్పాన్సర్‌షిప్‌ను సొంతం చేసుకుంది.
"2019-23 హోం సీజన్‌కు గెలిచిన బిడ్ ధర రూ.326.80 కోట్లు. గతంలో ఒక మ్యాచ్‌కు బిడ్ ధర రూ.2.4 కోట్లు కాగా ఇప్పుడు రూ.3.80 కోట్లకు పెరిగింది. అంటే దాదాపు 58% వృద్ధి సాధించింది" అని బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. ‘
"బీసీసీఐ హోం సిరీస్ టైటిల్ స్పాన్సర్‌గా పేటీఎంను ప్రకటిస్తున్నందుకు ఆనందంగా ఉంది. పేటీఎం భారత్‌లో ఆధునిక తరానికి చెందిన సంస్థ. భారత్ క్రికెట్‌కు సుదీర్ఘంగా టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నందుకు మేం గర్విస్తున్నాం".
-బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీ
భారత్ క్రికెట్‌ను అమితంగా ప్రేమిస్తుందని, పేటీఎం అతిపెద్ద అభిమాని అని ఆ సంస్థ సీఈవో విజయ్ శేఖర్ శర్మ అన్నారు.
ఇవీ చూడండి.. యాషెస్: ఇంగ్లాండ్ తొలి గెలుపు అందుకుంటుందా..!