ETV Bharat / sports

'భారత ఆటగాళ్లు మార్చి 1న అహ్మదాబాద్​లో ఉండాలి'

ఇంగ్లాండ్​తో పొట్టి సిరీస్​కు ఎంపికైన ఆటగాళ్లు మార్చి 1న అహ్మదాబాద్​లో రిపోర్టు చేయాలని బీసీసీఐ పేర్కొంది. సిరీస్​కు ముందు ఓపెనర్​ ధావన్​తో పాటు ఇషాన్​ కిషన్, సూర్యకుమార్​ యాదవ్​, రాహుల్​ తెవాతియాలు బయో బబుల్​లో ఉండాలని తెలిపింది.

BCCI asks white ball specialists to report in Ahmedabad on Mar 1
'మార్చి 1న అహ్మదాబాద్​లో రిపోర్టు చేయండి'
author img

By

Published : Feb 21, 2021, 10:24 PM IST

ఇంగ్లాండ్​తో టీ20 సిరీస్​కు ఎంపికైన భారత ఆటగాళ్లు మార్చి 1న రిపోర్టు చేయాలని బీసీసీఐ పేర్కొంది. ఓపెనర్​​ శిఖర్​ ధావన్​తో పాటు ప్రస్తుతం విజయ్​ హజారే టోర్నీలో ఆడుతున్న ఇషాన్​ కిషన్​, సూర్యకుమార్​ యాదవ్​, రాహుల్​ తెవాతియాలను అహ్మదాబాద్​లో నివేదిక సమర్పించాలని బోర్డు తెలిపింది. దీంతో తదుపరి హజారే మ్యాచ్​లకు వీరు దూరం కానున్నారు.

"విజయ్​ హజారే టోర్నీలో ఆడుతున్న యువ ఆటగాళ్లతో పాటు శిఖర్​ ధావన్ మార్చి 1న అహ్మదాబాద్​లో రిపోర్టు చేయాలి. కరోనా మార్గదర్శకాలకు అనుగుణంగా వారు మరో బయో బబుల్​లో ఉండాల్సిన అవసరం ఉంది" అని డీడీసీఏ అధికారి ఒకరు పేర్కొన్నారు.

ఇంగ్లాండ్​తో 5 మ్యాచ్ల​ టీ20 సిరీస్​ మార్చి 12-20 వరకు జరుగనుంది. ఇందుకోసం 19 మందితో కూడిన భారత జట్టును యాజమాన్యం శనివారం ప్రకటించింది. 3 మ్యాచ్​ల వన్డే సిరీస్​ మార్చి 23-28 వరకు జరుగనుంది.

ఇదీ చదవండి: 'స్వదేశంలో అనుకూల పిచ్​లు మామూలు విషయమే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.