ETV Bharat / sports

బీసీసీఐ ఏజీఎమ్​: లోధా కమిటీ సంస్కరణలకు చరమగీతం..!

బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరభ్​ గంగూలీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి వార్షిక సాధారణ సమావేశం నేడు జరగనుంది. ఇందులో సుప్రీంకోర్టు సహా లోధా కమిటీ చేసిన పలు సంస్కరణలకు చరమగీతం పలికే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇదే సమావేశంలో బీసీసీఐ నూతన రాజ్యాంగ సవరణకూ ఆస్కారం ఉంటుందని సమాచారం.

BCCI Apex Council meeting held on sunday
బీసీసీఐ వార్షిక సమావేశం
author img

By

Published : Dec 1, 2019, 6:31 AM IST

బీసీసీఐ వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎమ్​) నేడు ప్రారంభం కానుంది. బీసీసీఐ అధ్యక్షుడుగా సౌరభ్​ గంగూలీ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి సమావేశం ఇదే. భారత క్రికెట్​ బోర్డు నూతన రాజ్యాంగంలో ఆచరణయోగ్యంగా లేని నిబంధనలను మార్చే సాధ్యాసాధ్యాలపై ఇక్కడ చర్చించనున్నారు.

విరామంపై దృష్టి..?

ఈ సమావేశంలో పదవుల మధ్య విరామంపై కీలక నిర్ణయం తీసుకోనుంది బీసీసీఐ బృందం. కూలింగ్‌ ఆఫ్‌ పీరియడ్‌ నిబంధనపై చర్చిస్తామని బోర్డు కోశాధికారి అరుణ్‌ ధూమల్‌ ఇప్పటికే స్పష్టం చేశారు.

" వయో పరిమితిని అలాగే ఉంచుతున్నాం. పదవుల మధ్య విరామాన్ని సవరించే అంశంపై దృష్టిపెట్టాం. రాష్ట్ర సంఘంలో ఆరేళ్లు అనుభవం సంపాదించిన వ్యక్తికి విరామం ఎందుకివ్వాలి? క్రికెట్‌ ప్రయోజనాల దృష్ట్యా ఆ అనుభవాన్ని బీసీసీఐలో ఎందుకు ఉపయోగించుకోవద్దు? విరామం ముందు అధ్యక్షుడు, కార్యదర్శిని వరుసగా రెండు దఫాలు, కోశాధికారి, ఇతర పాలకులకులను ఒకేసారి మూడు దఫాలు (9 ఏళ్లు) కొనసాగించాలి. గత నెలలో బోర్డు ఎన్నికలు జరిగితే 38 మందిలో కేవలం నలుగురైదుగురికే సమావేశాల్లో పాల్గొన్న అనుభవం ఉంది. అలాంటప్పుడు రాష్ట్ర సంఘాల్లో అనుభవం ఉన్నవారిని బీసీసీఐలో ఉపయోగించుకుంటే మంచిది. లోధా సిఫార్సుల ప్రకారమైతే ఒకేసారి అన్ని రాష్ట్రాల్లో ఉన్నవారిని అనర్హులుగా ప్రకటించాలి"
-- అరుణ్‌ ధూమల్‌, బీసీసీఐ కోశాధికారి

BCCI Apex Council meeting held on sunday
బీసీసీఐ ఏజీఎమ్​: లోధా కమిటీ సంస్కరణలకు చరమగీతం..!

ఇదీ నిబంధన....

జస్టిస్‌ ఆర్‌ఎం లోధా సిఫార్సుల ప్రకారం ఏ పాలకుడైనా రాష్ట్రంలో లేదా బీసీసీఐలో రెండు దఫాలు పనిచేసిన తర్వాత మూడేళ్లు కచ్చితంగా విరామం తీసుకోవాలి. ప్రస్తుత నిబంధనల ప్రకారం గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా కేవలం 10 నెలలు మాత్రమే పదవిలో ఉండాలి. ఎందుకంటే ఆయన బంగాల్‌ అధ్యక్షుడుగా నాలుగున్నరేళ్లకు పైగా పనిచేశారు. ఇప్పుడు నిబంధన సవరిస్తే తొలి ప్రయోజనం ఆయనకే చేకూరుతుంది.

అయితే గతంలో సుప్రీం కోర్టే ఒక రాష్ట్రం ఒక ఓటు’ వంటి నిబంధనలను సవరించిందని గుర్తుచేశాడు అరుణ్​. సీఓఏ సైతం పరస్పర విరుద్ధ ప్రయోజనాలపై ఇలాగే వ్యవహరించిందని తెలిపాడు. మూకుమ్మడిగా తామే అన్ని నిర్ణయాలు అమలు చేయబోమని స్పష్టం చేసిన అరుణ్... సవరించిన నిబంధనలు సుప్రీం కోర్టుకు సమర్పిస్తామని తెలిపాడు.

BCCI Apex Council meeting held on sunday
గంగూలీ

రాష్ట్ర సంఘాలతో...

ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో... పలు అంశాలపై రాష్ట్ర క్రికెట్ సంఘాలతోనూ చర్చించనుంది బీసీసీఐ. ప్రయోగాత్మకంగా నిర్వహించిన డే/నైట్‌ టెస్టు విజయవంతం కావడం వల్ల టెస్టు క్రికెట్‌పై ఆసక్తి పెంచేందుకు దీనిని ఇంకా ఎలా ఉపయోగించుకుంటే బాగుంటుందో ఈ సమావేశంలో చర్చించనున్నారు. అన్ని సంఘాలను అడిగి ఒక విధాన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మంచు ప్రభావం, మైదానం, ఆడే కాలాన్ని బట్టి మున్ముందు గులాబీ బంతి మ్యాచుల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని ధూమల్‌ వెల్లడించాడు.

ఇదీ చదవండి: శంషాబాద్ ఘటన సిగ్గుచేటు: విరాట్​

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Beirut – 30 November 2019
1. Various of people, mostly women, marching across a former front line, holding flowers and Lebanese flags
2. Sign reading (Arabic) "The most beautiful mothers are the revolutionaries' mothers."
3. Women chanting pro-Lebanese people slogans
4. Mid of flowers and signs carried by protesters
5. Women chanting slogans
6. Wide of women from Khandaq al-Ghamiq throwing rice from the balcony as a welcoming gesture
7. Tilt down from family watching on the balconies to people marching and chanting
8. Various of the march
9. Sign reading (Arabic) "With love, we all are on one side."
10. Various of the march
11. SOUNDBITE: (Arabic) Asmaa Ayyad, protester:
"I want to convey the message of love and closeness and rejection of hate. This is the required message, we are talking about mothers who are raising different generations, these mothers stand at the front of society, they have the main role to prevent sectarian violence. Our message is communication between neighbourhoods, and to prevent any attempts to block the roads, because blocking roads will lead to separate parts of our homeland, the separation of the people. Therefore, we want this communication to take place. This is the message that we want to convey, we don't want to destroy the reputation of our neighbourhoods, we must unite together in order to defend our homeland, to defend this neighbourhood or the other neighbourhood."
12. People waving from their window
13. Various of people marching
14. Various of security forces on the streets
STORYLINE:
A rally of mainly women crossed a former front line in the Lebanese capital on Saturday, carrying white roses and Lebanese flags to denounce clashes between rival groups in the area days earlier.
They marched across Beirut's central Ring Road from the eastern mostly Christian neighbourhood of Achrafieh while others came from the Shiite area of Khandaq al-Ghamiq.
Demonstrators, mostly women, rallied to reject sectarianism and called for unity.
Nationwide protests that began October 17 over widespread corruption and mismanagement have recently slid into violence.
Last Sunday, supporters of the two main Shiite groups, the militant Hezbollah and the Amal Movement of Parliament Speaker Nabih Berri, attacked protesters on Ring Road.
During the civil war, that thoroughfare had connected predominantly Muslim neighbourhoods in the city's west with Christian areas in the east.
President Michel Aoun has yet to hold consultations with parliamentary blocs on choosing a new prime minister after the government resigned a month ago.
Outgoing Prime Minister Saad Hariri, who was Aoun's and Hezbollah's favourite to lead a new Cabinet, withdrew his candidacy for the premiership, saying he hoped to clear the way for a solution to the political impasse after over 40 days of protests.
Protesters have resorted to road closures and other tactics to pressure politicians into responding to their demands for a new government.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.