ఐపీఎల్ కొత్త సీజన్‌కు అధికారిక భాగస్వామిని బీసీసీఐ ప్రకటించింది. బెంగళూరుకు చెందిన ఆన్లైన్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ సంస్థ 'అన్అకాడమీ'ని ఎంపిక చేసినట్లు వెల్లడించింది. ఇప్పటి నుంచి మూడేళ్ల పాటు ఒప్పందం కొనసాగుతుందని స్పష్టం చేసింది భారత క్రికెట్ బోర్డు.
"ఐపీఎల్ అధికారిక భాగస్వామి 'అన్అకాడమీ'కి స్వాగతం పలుకుతున్నాం. 2020 నుంచి 2022 వరకు ఈ ఒప్పందం కొనసాగుతుంది. ఈ మెగాలీగ్ భారత్‌లో అత్యధికులు చూస్తారు. అలాగే, దేశంలో అభివృద్ది చేసిన ఎడ్యుటెక్ దిగ్గజం అన్అకాడమీ ఇందులో భాగస్వామ్యం కావడం వల్ల కొన్ని కోట్ల మంది ప్రేక్షకుల్లో సానుకూల దృక్పథాన్ని తీసుకురాగలదు. ఎంతో మంది యువతకు ఇది ఉపయోగపడుతుంది"
- బ్రిజేష్ పటేల్, ఐపీఎల్ ఛైర్మన్
ఐపీఎల్‌తో భాగస్వామ్యం కావడం వల్ల తమ సంస్థ రెండింతల వృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు అన్అకాడమీ వైస్ ప్రెసిడెంట్ కరణ్ ష్రాఫ్. ఈ అవకాశం కల్పించిన బీసీసీఐ, ఐపీఎల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అంతకు ముందు ఐపీఎల్ 13 టైటిల్ స్పాన్స్ర్గా డ్రీమ్ 11ను ఎంపికైంది. దుబాయ్ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు బయోసెక్యూర్ వాతావరణంలో ఈ మెగాలీగ్ జరగనుంది.
ఇదీ చూడండి 'కోహ్లీని చూసి బాబర్ ఆ విషయం నేర్చుకోవాలి'