ఐపీఎల్ 13వ సీజన్‌కు చెందిన మరో అధికారిక భాగస్వామి పేరును ప్రకటించింది బీసీసీఐ. ప్రముఖ క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ ప్లాట్‌ఫాం 'క్రెడ్' (సీఆర్‌ఈడీ)ను ఇందుకు ఎంపిక చేసింది. ఇప్పటి నుంచి మూడేళ్ల పాటు ఒప్పందం కొనసాగుతుందని ట్విట్టర్ వేదికగా స్పష్టం చేసింది భారత బోర్డు.
-
Well done bcci and team ..in spite of tuff markets ..@JayShah @ThakurArunS @BCCI @ChennaiIPL @KKRiders @mipaltan @DelhiCapitals @SunRisers @lionsdenkxip @rajasthanroyals @RCBTweets https://t.co/ERyHcnvc5F
— Sourav Ganguly (@SGanguly99) September 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Well done bcci and team ..in spite of tuff markets ..@JayShah @ThakurArunS @BCCI @ChennaiIPL @KKRiders @mipaltan @DelhiCapitals @SunRisers @lionsdenkxip @rajasthanroyals @RCBTweets https://t.co/ERyHcnvc5F
— Sourav Ganguly (@SGanguly99) September 1, 2020Well done bcci and team ..in spite of tuff markets ..@JayShah @ThakurArunS @BCCI @ChennaiIPL @KKRiders @mipaltan @DelhiCapitals @SunRisers @lionsdenkxip @rajasthanroyals @RCBTweets https://t.co/ERyHcnvc5F
— Sourav Ganguly (@SGanguly99) September 1, 2020
ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో.. బీసీసీఐ గొప్ప నిర్ణయం తీసుకుందని అన్నారు బోర్డు అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ. ఈ మెగాలీగ్‌లో భాగం కావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు క్రెడ్ సంస్థ సీఈఓ కునాల్ షా.
ఇటీవల బెంగళూరుకు చెందిన ఆన్లైన్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ సంస్థ 'అన్ అకాడమీ'ని అధికార భాగస్వామిగా ప్రకటించింది బోర్డు. అంతకు ముందు ఐపీఎల్ 13 టైటిల్ స్పాన్స్ర్గా 'డ్రీమ్ 11' ఎంపికైంది.
దుబాయ్ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు బయోసెక్యూర్ వాతావరణంలో ఈ మెగాలీగ్ జరగనుంది. అబుదాబి, షార్జా, దుబాయ్ వేదికల్లో మొత్తం 53 రోజులు ఈ టోర్నీ నిర్వహించనున్నారు.
ఇది చూడండి ఐపీఎల్ అధికారిక భాగస్వామి 'అన్అకాడమీ'