బిగ్‌బాష్ లీగ్‌లో కొవిడ్ నిబంధనలు అతిక్రమించిన కారణంగా ఇద్దరు ఆటగాళ్లకు జరిమానా విధించింది క్రికెట్ ఆస్ట్రేలియా. బ్రిస్బేన్ హీట్ జట్టులోని క్రిస్ లిన్, డాన్ లారెన్స్‌లపై ఆరోపణలు వచ్చిన క్రమంలో వీరిద్దరి జీతాల్లో కోత పడింది.
లిన్, లారెన్స్.. ఇద్దరూ కలిసి ప్రేక్షకులకు దగ్గరగా వెళ్లి వారితో సెల్ఫీలు దిగినట్లు సోషల్‌మీడియాలో ప్రచారం జరిగిందని క్రికెట్ ఆస్ట్రేలియా విచారణలో తేలింది.
అయితే, కరోనా నిబంధనలు అతిక్రమించిన కారణంగా వీరిద్దరూ క్షమాపణలు తెలియజేశారు. ఈ నేపథ్యంలో సోమవారం సిడ్నీ థండర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జట్టు ఆటగాళ్లకు క్రిస్ లిన్, లారెన్స్ భౌతిక దూరం పాటించారు. ఈ మ్యాచ్‌లో బ్రిస్బేన్ హీట్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.
కరోనా నిబంధనలు సెక్షన్ 1,3,4,9 ప్రకారం బ్రిస్బేన్ హీట్ జట్టుకు 50 వేల డాలర్లను జరిమానాగా.. అతిక్రమించిన ఆటగాళ్లకు 10వేల డాలర్ల ఫైన్‌ను మంగళవారం క్రికెట్ ఆస్ట్రేలియా విధించింది.